కరి కాలమహారాజుని అనుగ్రహించిన తీరు
పరమ పుణ్యక్షేత్రముగా ప్రసిద్ధినొందిన కాంచీ పట్టణమునకు *'మహాబాహువు'* రాజై
పరిపాలించసాగెను. మహాశాస్తా యొక్క పరమ భక్తుడైన అతడు , స్వామి యొక్క అనుగ్రహము చేత
రాజ్యపాలన యందునూ , భక్తి తత్పరత యందునూ అగ్రగామిగా నిలిచిన వాడయ్యెను అతడి భక్తికి
మెచ్చిన శాస్తా , కోరినచోటికి తక్షణమే వెళ్ళునటువంటి పుష్పక విమానము నొకదానిని బహుమతిగా నొసంగెను.
వేదములకు నాయకుడూ , అఖిలలోక పాలకుడూ అయిన మహాశాస్తాని గూర్చి ఒక పెద్ద యజ్ఞము తల పెట్టెను. ఇష్టము వచ్చిన చోటికి యుధేచ్ఛగా వెళ్ళగలుగు పుష్పక విమానము ఉండుట
చేత బ్రహ్మాది దేవతలను , సకల నదీజలములను , పర్వతములను , దిక్పాలకులను , ఇలా అందరినీ తాను చేయు యాగమునకు ప్రత్యేకముగాపోయి ఆహ్వానించెను. అతడి ఆహ్వానము మేరకు , అతడు పిలిచిన వారందరూ వచ్చి యజ్ఞమునందు పాల్గొనిరి. యాగము శాస్తా అనుగ్రహము వలన
నిర్విఘ్నముగా , నెరవేరినది. వచ్చిన ఆహుతులందరికీ తగినసత్కారములను , బహుమానములను
సరిసమానముగా అందరికీ పంచెను.
అందరి వలెనే అచటికి ఏతెంచిన వాడు హిమవంతుడు. హిమవత్ పర్వతరాజైన అతడు
అహంకార స్వభావము కలిగినవాడు. మహాశక్తి అయిన పార్వతీ దేవిని కుమార్తెగానూ , ఈశ్వరుడంతటి
వానిని అల్లునిగానూ పొందిన తనను అందరికన్నా మిన్నగా గౌరవించనెంచెను. మామూలు స్థాయికి
చెందిన వింధ్య పర్వతములతో సమానముగా , తనను గౌరవించినందులకు మహారాజు పై కినుకబూనెను. అందరూ చూచు చుండగా , మహారాజు బహుమతిగా నొసగిన కానుకలను చెల్లా చెదురుగా పడవైచి ,
నిర్లక్ష్యముగా బయటికి పోవుచుండెను. ఇదంతయూ చూచిన బ్రహ్మదేవుడు ఆగ్రహించి *” హిమవంతా ! సర్వేశ్వరుడైన మహాశాస్తా కొరకై అతడి పరమభక్తుడైన మహాబాహుచేయు యాగమున బహుమతిగా నొసగిన వాటిని అహంకారముచేత విసరివైచితివి. ఇందులకై భవిష్యత్తున నీవు , ఇతడివంటి ఒక పరమభక్తునిచే దండింపబడి , అతడి చేత ఓడిపోవుదువుగాక !”* అని శపించెను. అతడి మాటలు పూర్తిగా వినకుండగానే విసురుగా బయటికి వెడలిపోయెను.
కొంతకాలము గడిచిన పిమ్మట , చోళదేశముననున్న కావేరి పూంపట్టణమును కల్మాషపాదుడు
అను రాజు పరిపాలించసాగెను సూర్యకుల తిలకమై చోళవంశమును పరిపాలించు అతడు చిన్న
వయసునుండియే అపారమైన తెలివితేటలు , పరాక్రమము కలిగిన వీరునిగా , ధీరునిగానూ ,
శాస్తాయొక్క పరమ భక్తునిగానూ వెలుగొందెను. స్వామి యొక్క ఆశీస్సులవలన , తనపై దండెత్త వచ్చిన వారిని ఓడించి , తన పాలనకు లోబడియుండు నట్లు చేసుకొనసాగెను. 'ప్రజలచే' కరికాలుడు అని
పిలువబడెను.
ఒకసారి తన రాజ్యమును విస్తరింపగోరిన కరికాలుడు పయనమార్గమున మోక్షపురి అయిన
కాంచీపురమును చేరి , ఆ నగరమునకు సమీపమున ఒక గుడారము వేసుకుని వేచి యుండెను.
ఆనాటి రాత్రి , కామకోటి యందు వెలసియున్న మహాశాస్తా , తన భక్తుడైన కరికాలుని
స్వప్నమందు సాక్షాత్కరించి *"భక్తా ! నేను కంచి కామకోటి యందు వెలసియున్నాను. మరునాడు వచ్చి నన్ను దర్శించుకుందువుగాక”* అని ఆనతిచ్చెను.
ఒకమామూలు మానవుడు , పేరు ప్రతిష్టలతో తనను మించిపోవుటను చూసి సహించలేని
హిమవంతుడు , ఒక మహారాజు రూపుదాల్చి కరికాలుని ఎదిరించెను. తన వద్ద నున్న పలు
ఆయుధములతో బాధించసాగెను. ఎంతగానో సహించిన కరికాలుడు , ఇక సహించనేరక స్వామి
తనకు ప్రసాదించిన ఛండాయుధమును హిమవంతుని తలపై తాకించెను. అది తాకినంతనే హిమవంతుడు మూర్చిల్లెను. ఇంకనూ ప్రయోగించునంతలో బ్రహ్మదేవుడు కరికాలుని వారించుచూ.
ఇదంతయూ జరుగుటకు కారణము , మునుపు తానిచ్చిన శాపమేనని తెలియజేసెను. తన
కమండలము నందలి నీటిని జల్లినంతనే మూర్చిల్లిన హిమవంతుడు తిరిగి లేచెను.
*గర్వభంగమైన హిమవంతుడు బ్రహ్మదేవునికి , కరికాలునికి నమస్కరించి” చోళ మహారాజా ! స్వామి యొక్క భక్తుని అవమానించుట వలననే నాకు ఈగతి పట్టినది. మహాశాస్తా యొక్క ఛండాయుధము యొక్క స్పర్శ తగిలినంత మాత్రముననే నాకు గర్వభంగమై , బుద్ధి వచ్చినది. ఈ విషయమును అందరూ తెలిసికొన వలయును. అందులకై విజయచిహ్నముగా , నీ యొక్క పతాకమును నా పర్వతముపై ఎగురువేయుదువుగాక”* అని అర్థించెను.
అతడు కోరిన విధముగానే హిమవత పర్వతముపై తన పతాకమును ఎగురు వేసిన కరికాలుడు ,
ముందుకుసాగి దండెత్తి , జయించి , అంతటా తన పతాకమును ఎగురవేసెను.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*