అప్పయ దీక్షితుని ఉన్నతిని చాటిన శాస్తా*
ఆస్వామి యొక్క లీలావినోదములు పలురీతులుగా నుండును. సుమారు ఐదు వందల
సంవత్సరముల మునుపు తొండ మండలము నందలి *'అడయబలం'* అను ఊరియందు
శివాంశసంభూతినిగా జన్మించినవారు అప్పయ దీక్షితులు , శివతత్వరూపునిగా విలసిల్లుతూ అద్వైత
మతమును ప్రకాశింప జేసిన వారు అప్పయ దీక్షితులు అందువలననే ఇతడిని అపరశంకరాచార్యులుగా
పండితులు పొగడుచుండిరి. జ్ఞాన సంపద అపారముగా నున్ననూ , లేశమైననూ అహంభావమూలేక ,
దీక్షితుని ప్రఖ్యాతులు నానాటికి పెరుగుచునే యుండెను. ఇది చూసిన తాతాచార్యులు అను వైష్ణవ పండితులు ఈర్ష్య చెందసాగెను.
ఇదే సమయమునందు తంజాపూరును పరిపాలించు చుండిన నరసింహవర్మ అను మహారాజు బృహదీశ్వర ఆలయ బ్రహ్మోత్సవ వేడుకలయందు పాల్గొనవలసినదిగా ఆహ్వానించి , తన పండిత
సభయందు కొలువు దీరమని కోరుకొనెను. ఉత్సవ వేడుకలు ముగిసిన పిమ్మట తక్కిన పండితులను
అందరికీ సత్కరించి పంపివేసిన మహారాజు , వీరు ఇరువురిని మాత్రము మరికొంత కాలము తమ
వద్ద గడుపమని అభ్యర్థించెను. ఇరువురి పండితులతో కలిపి , క్షేత్రాటన చేయు సమయమున
త్రయంబక పురం అను స్థలమునందలి ఆలయమున , *శ్రీశాస్తా తన చిబుకమునందు , తన కుడిచేతి
చూపుడువేలుని ఉంచి ఏదో ఆలోచనలో నుండునట్లుగా యున్న భంగిమను చూచెను.*
*శాస్తా యొక్క ఈ అపూర్వభంగిమ , స్వామి ఏదో తీవ్రమైన ఆలోచనలో నుండునట్లుగా తోచెను. ఈ అపూర్వదృశ్యము చూచుటకు కడు కమనీయముగా నుండెను. దావుల నున్న గ్రామ ప్రజలను పిలిపించి హరిహర పుత్రుడు ఈ భంగిమలో ప్రత్యేకముగా నుండుటకు కారణమేమై యుండునని ప్రశ్నించెను.*
*ఆ వూరి ప్రజలలోని ఒక ముదుసలి మహారాజా ! మమ్ములను పరిపాలించు కులదైవమే ఇతడు. తరతరాలుగా మా పూర్వీకులు చెప్పిన విషయమును మీ ముందుచున్నాను. *”ఒక మహాపురుషుడు ఇచటికి వచ్చును. శాస్తా ఈ విధముగా నుండుటకు గల కారణమును అతడే వివరించును , అది విన్న తరువాత స్వామి సంతోషించి , తన చూపుడు వేలును , చుబుకము నుండి తీసివేయును” అని మా పూర్వీకులు చెప్పుదురు. అతడెవరో, ఎప్పుడు వచ్చునో”* అని నిట్టూర్చెను.
మహారాజు తాతాచార్యుని చూచి *"అయ్యా ! శాస్తాని గురించి ఈ విషయమై మీకేమైనా తెలియునా ?”* తెలిసినచో దయచేసి చెప్పుమని' వేడుకొనెను. దేవరహస్యమును గూర్చి మహారాజంటి వాడే తనను అడుగుచున్నాడని గొప్పలు పోయెను.
కొంచెము కూడా సంశయింపనివాడై, తన పాండిత్యమును ప్రదర్శించు సమయము ఇదే నని తలచిన వాడై ఇట్లు ఒక శ్లోకమును పఠించెను.
*“విష్ణోః సుతోహం విధినా సమోహం*
*ధన్యగ్రోహం సురసేవితోహం |*
*తదాపి భూతేచ సుతోహం , ఏతైర్*
*భూతైర్ వృతశ్చింతయ ధీహ శాస్తా॥*
అనగా , నేను విష్ణు పుత్రుడను , కాబట్టి నేను బ్రహ్మదేవునికి సమానుడను ఇట్లు ఉన్నతునిగా
వెలుగొందుటచేత సకల దేవతలూ పొగిడి, ప్రణమిల్లుచున్నారు. కానీ భూతగణాధిపతి అయిన
పరమేశ్వరునికి కూడా నేను పుత్రుడనే అయినందువలన భూతముల మధ్య ఉండవలసిన గతి
పట్టినదే అని చింతించుచూ, అయోమయ స్థితిలో నుండునట్లుగా వర్ణించెను.
కావలయుననియే వైష్ణవ భక్తుడైన తాతాచార్యులు పరమశివుని గూర్చి నిందించునట్లుగా
వర్ణించెను. కానీ దయాపరుడైన భూతనాధునికి ఎట్టి బేధమూ లేదు. తన తండ్రి అయిన పరమశివుని
కించపరచినట్లుగా వర్ణించిన తీరు సహించని వాడయ్యెను. ఆకారణముగా శాస్తా యొక్క భంగిములో
మార్పు గోచరించనిదయ్యెను. తాతాచార్యులకు ఇది అవమానముగా తోచెను.
మహారాజు అప్పయ దీక్షితుని వంక తిరిగి “మహాత్మా! దయచేసి మీరైనా ప్రయత్నించి చూడుడు"
అని వేడుకొనెను.
భక్తి , వినయశీలత సమానముగా కలిగిన దీక్షితులు , నిజమైన కారణమును తెలియజేయుమని
శాస్తాని మనస్సు నందు ధ్యానించినవాడై , స్వామి యొక్క ఆశీస్సులతో కింది విధముగా పఠించెను.
*అంభేది గౌరీం అహమాహ్వయామి*
*పత్స్య పితుర్ మాతర ఏవ సర్వాః |*
*గతంతు లక్ష్మీం ఇతి చింతయంతం*
*శాస్తార మీథే సకలార్ధ స్వి ||*
మోహినికి , శివునికి పుత్రునిగా జన్మించిన నేను , కైలాసమునకు బోవునపుడు పార్వతీ దేవిని అమ్మాయని పిలుచుదును. తండ్రి గారి భార్యలందరూ మాతృ సమానులే. కదా !
కానీ వైకుంఠమునకు
పోవునపుడు మాతృస్వరూపునిగా శ్రీమహావిష్ణువే అయినపుడు , మహాలక్ష్మిని ఏమని సంబోధించ వలెనన్నదే నా ఆలోచన *"అన్నట్లుగా రూపుదాల్చిన శాస్తాని నాయొక్క సకల అభీష్టములను నెరవేర్చుమని ప్రార్థించుచున్నాను.*
అంతలో బిగ్గరగా నవ్వుచున్న సవ్వడి వినిపించినంతనే , శాస్తా యొక్క భంగిమ మారి , అతడి చిబుకముపై నున్న చూపుడువేలు తన యధాస్థానమునకు పోయెను.
దీక్షితుని యొక్క సత్యవాక్కు శాస్తా యొక్క భంగిమ మారిన విధానము చూచి అందరూ ఆనంద
పరవశులైరి. మహారాజు అతడిని ఎన్నో రీతుల గౌరవించి , అంతులేని కానుకలిచ్చి పంపెను.
