విప్రపుంగవుని అనుగ్రహించిన విశ్వేశ్వరుడైన శాస్తా*
తనను నమ్మినవారిని ధర్మపాలకునిగా కాపాడి రక్షించు శాస్తా , తగిన సమయమున దుష్టులను
దండించుటలోనూ ఆరితేరినవాడు అటులనే దండించు సమయమున వారిని , వారితప్పులను
తెలిసికొనునట్లు చేయువాడు కూడా అతడే.
ఒకప్పుడు వైశ్య కులము నందు జన్మించిన వాడైన సుందుడు అను వాడు జీవించుచుండెను.
విధివశాత్తూ అతడు చోరవృత్తిని ముఖ్యమైన జీవనవృత్తిగా అవలంబించువాడు. కాలక్రమేణా ఆరితేరిన బందిపోటు దొంగగా మారిపోయెను. అతడు ఒక గుంపుగా కూడి , పలుక్షేత్రములకు
పోయి , అచటికి వచ్చు భక్తులను ఏమార్చుచూ , వారి వస్తువులనూ , ఆభరణములను
అపహరించుచుండెను.
ఒకనాడు నర్మదానదీ తీరమునుండి వచ్చిన *'బుధుడు'* అను విప్రుడు నటన సభాపతి
ఆనందనర్తనము చేయు చిదంబర క్షేత్రనాధుని దర్శించగోరి , తన కుటుంబ సభ్యులతో సహా
వచ్చెను. అట్లు వచ్చునంతలో , చిదంబరమునకు దావుల నున్న ఒక స్థలమున బస చేసియుండగా ,
తన గుంపుతో వచ్చిన సుందుడు వారి వస్తువులను , ఎడ్ల బండ్లతో సహా అపహరించిపోయెను.
నిద్రనుండి లేచిన బుధుడు , తన వస్తువులన్నియూ అపహరింపబడిన సంగతి తెలిసికొనెను. ఏమి చేయుటకూ పాలుబోని వాడై కూర్చుని ఉండెను.
శివపూజకై బిల్వపత్రమును సేకరించుటకై అటుగా వచ్చిన చిదంబర వాసియైన ఒక బ్రాహ్మణుడు బుధుని యొక్క ధనము , వస్తువులు అపహరింపబడిన సంగతి తెలిసికొనెను. అతడి యందు కనికరము కలిగిన వాడై *“భయపడవలదు. తక్షణమే బ్రహ్మతీర్ధమునకు కుడివైపున నున్న బ్రహ్మశాస్తా ఆలయమునకు పోయి , స్వామి యొక్క ఆపదుద్దారక స్తోత్రమును పఠింపుము. స్వామి అనుగ్రహము వలన పోగొట్టుకున్న వస్తువులన్నియూ తిరిగి పొందుదువుగాక”* అని సలహా ఇచ్చెను.
అతడు చెప్పినట్లుగానే బుధుడు భక్తి శ్రద్ధలతో బ్రహ్మ తీర్ధమున నీరాడి , శాస్తా ఆలయమునకు
పోయెను. అచట శిలారూపునిగా కొలువైయున్న బ్రహ్మశాస్తాని చూచి , అతడిరూపు తన మది
యందు నిలుపుకొన్నవాడై , *”దేవాదిదేవా ! హరిహరపుత్రా ! దొంగలచే అపహరింపబడిన నా వస్తువులన్నియూ తిరిగి నేను పొందునట్లుగా అనుగ్రహింతువు గాక”* అని ఆర్తిగా ప్రార్థించి
ఆపదుద్ధారక స్తోత్రమును పఠించెను. ఆపదలనుండి కాపాడు నట్టి వాడైన శాస్తా ఎంతగానో
సంతోషించెను. విప్రునకు సహాయము చేయగోరి , పెద్ద శబ్దముతో , ప్రకాశవంతమైన రూపముతో అతడి ముందు నిలిచెను. సుందుని తన వద్దకు ఈడ్చుకురమ్మని తన గణములను ఆదేశించెను.
శాస్తృగణములు వెనువెంటనే స్వామి ఆజ్ఞను శిరసావహించిరి. సుందుడు తన పరివారముతో సహా
స్వామి ముందు నిలబడెను. బుధుని వస్తువులను బుధునికి అందచేసెను.
బుధుడు ఆనందముప్పొంగగా , స్వామిని ఎన్నో రీతుల స్తుతించుచూ , *“ప్రభూ ! నన్ను ఈ దొంగలబారినుండి కాపాడినట్లే , మానవులనందరినీ దొంగల భయము లేనట్లుగా కాపాడి రక్షించుము. ఈ వరమును ప్రసాదించు తండ్రీ”* అని వేడుకొనెను.
*“అట్టే అగుగాక !”* అని వరమును ఒసగిన పిమ్మట స్వామి అంతర్థానమయ్యెను. బుధుడు తన
వస్తువులను తిరిగి పొందిన సంతోషముతో చిదంబర దర్శనము ముగించిన పిమ్మట తన ఊరికి తిరిగి పోయెను.
ఇక సందుడు స్వామి సన్నిధానమును చేరినంతనే , పాప పంకిలమైన చోరవృత్తిని మరచినవాడై మంచి గుణములు కలిగిన వాడయ్యెను. స్వామి దర్శన భాగ్యము వలన సత్ ప్రవర్తన కలిగి , శాస్తా
యొక్క పరమభక్తుడై నటరాజస్వామికి చిదంబరమందు ఒక వసంత మండపమును
నిర్మించినవాడయ్యెను.
సదా సర్వకాలమూ శాస్తాని మనస్సున ధ్యానించుచూ , దేవతలచే సైతము పొగడుబడు ఉన్నత స్థితిని పొందినవాడయ్యెను. చివరకు స్వామి పాదముల చెంతకు చేరెను.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*