స్త్రీ జాతికి వన్నె తెచ్చిన పుణ్యవంతుడు*
పూర్వకాలమున, తామ్రపర్ణి నది ప్రవహించుచుండు , తిరునెల్వేలి తాలుకాకు చెందిన (తమిళనాడు)
*'కీళాంబూర్'* అను చోట ఒక పేద విప్రుడు జీవించుచుండెను. అతడు శాస్తా యొక్క పరమభక్తుడు. తన కుమార్తెను , సమీపమున నున్న *'కళక్కాడు'* అను గ్రామవాసికిచ్చి వివాహము చేసి యుండెను.
ఆమె గర్భము ధరించగా , ప్రసవమునకు పుట్టినింటికి తీసుకుని పాదచారియై వచ్చుచుండెను.
తండ్రి పండు ముసలివాడు. కుమార్తె నవమాసములు నిండియున్న పరిస్థితులలో నున్నది. దారంతా వారు , ఆపదయందు సదా తమను కాపాడునట్లుగా దైవమును ప్రార్థించుచూ వచ్చుచుండిరి. అడవి మార్గమున వారు అట్లు వచ్చుచుండగా *'పాప్పాంకుళం'* అను స్థలమునకు వచ్చి చేరిరి. ఆదారి అంతయూ గుంటలు , గుంటలుగా దారి సరిగ్గా లేక యుండెను. అప్పటికి చీకటి పడిపోయెను.
నవమాసములు నిండిన ఆమెకు ప్రసవవేదన ఆరంభమైనది. అడవిమధ్య ఒంటరిగా ఏమి చేయుటకు వారికి పాలుపోలేదు. వారు దైవానామస్మరణ చేయుచునే చుండిరి. అంతలో ఉరుములు ,
మెరుపులుగా కుండపోతగా వర్షము కురియసాగెను. గుంటలు గుంటలుగా ఉన్న ఆ స్థలము వాన నీటితో నిండిపోయి , అడుగులు వేయుటకు కూడా కష్టసాధ్యమై యుండెను. దానికి తోడుగా అడవి
యందలి జంతువులు , పక్షులు ప్రకృతి భీభత్సమునకు జడిసి చెల్లా చెదురుగా పరుగెడసాగినవి.
ప్రసవవేదనతో అలమటించు అతడి కుమార్తె బాధతో సొమ్మసిల్లిపోయినది. వారికి సహాయము
చేయు తోడు కూడా లేకయుండిరి. తమను కాపాడుమని ఆ ముదుసలి శాస్తాని ప్రార్థించెను.
అదే స్థలమున కొలువై యున్న బాలాశాస్తా , వారి యందు దయబూని , అనుగ్రహింపగోరెను.
ముదుసలి అయిన ఆ తండ్రికి కొంతదూరమున ఒక వెలుగు కనిపించగా , తమకు తోడుగా రమ్మని
పిలుచటకై వెలుగు కనిపించిన దిక్కుగా వెడలిపోయిన సమయమున మహాశాస్తా ఒక స్త్రీ వేషముబూని ,
ఆమెకు సహాయము చేయుటకై ప్రత్యక్షమయ్యెను. దీర్ఘమైన కురులు కలిగి , చేత ఒక దీపము
పట్టుకుని ఒక హరిజన యువతిని బోలి , అచటికి వచ్చెను.
ఆమెకు స్పృహ వచ్చునట్లు చేసి , స్వంత తల్లి వలె సుఖప్రసవము జరుగునట్లుగా చేసినది.
తల్లివలె దయా పరునిచే ప్రసవము జరిగిన కారణముగా జన్మించిన ఆ బిడ్డ ఎట్లుండును ?
ప్రకాశవంతముగా వెలుగుచుండెను.
ఇదంతయూ , జరిగి ముగిసినంతనే , దీపము కనిపించిన దిక్కుగా వెతుకబోయిన విప్రుడు అక్కడ ఎవరూ లేకపోవుటచూచి , వెనుతిరుగునంతలో స్త్రీ రూపమున అవతరించిన స్వామి అతడితో ,
కుమార్తెకు సుఖప్రసవము జరిగిన సంగతి నెరిగించెను.
సుఖప్రసవ అనంతరము తల్లీ , బిడ్డా క్షేమముగా నుండుట చూచి తన కుమార్తెకు సహాయము
చేసిన స్త్రీకి కృతజ్ఞత తెలుపుకొనుటకై వెనుదిరిగి చూడగా , ఆమె అంతర్థానమై యుండెను.
తమను బాధలనుండి విముక్తి కలుగజేసిన శాస్తాయే స్త్రీ రూపున వచ్చిన సంగతి గ్రహించెను. భక్తి పారవశ్యమున , కనుల నిండుగా నీరు కలుగగా , ఆనందము ఉప్పొంగగా రెండు చేతులూ జోడించి అనేక విధముల స్వామిని ప్రార్థించెను. తన వద్ద స్వామికి కృతజ్ఞతగా నివేదించుటకు ఏమియే లేదు. అత్తవారింటినుండి పుట్టినింటికై ఆమె తెచ్చుచున్న కొంతబియ్యము , ఒక కొబ్బరికాయ తప్ప ఏదియూ లేదు. తన ఆశక్తతకు బాధపడినవాడై , వాటినే స్వామికి నివేదించెను.
వెంటనే స్వామి మాటలు ఆకాశవాణి రూపున ఇట్లు వినబడినవి. *“విప్రవర్యా ! మీ కుమార్తెకు ప్రసవము జరిపినది వేరు ఎవరూ కాదు. ఇచ్చోట కొలువై , బాలశాస్తాగా పూజలందుకొనుచున్న నేనే. నీకు నా పైగల భక్తికి మెచ్చి , తల్లివలె ఆమెకు సేవ చేసితిని. నా అనుగ్రహము పరిపూర్ణముగా పొందిన ఈమెకు ఎనిమిదిమంది సంతానము కలుగును. వారు నన్ను కులదైవముగా కొలిచి కొనియాడుదురు. స్త్రీ సంతానము నా యందు దాసులై యుండి , వారికి బాధలు కలుగు సమయము నందునూ , ప్రసవవేదనకు గురి కాబడు సమయమునందునూ నన్ను ప్రార్థించినచో కష్టములు తొలగగలవు”* అని ఆశీర్వదించెను.
తనంతట తానే తరలివచ్చి అనుగ్రహించిన దయాపరుడైన భగవంతుడు చెప్పిన మాటలు విన్న
విప్రుడు శిరస్సు వంచి పాదాభివంనము చేసెను. ఆలయమునందుగల శాస్తాని ఈ రీతిని
పూజించెను.
అతడి వంశానుక్రమమును కలిగిన ఎనిమిది మంది సంతానము ఈనాటికీ స్వామికి దానులై ,
వారికరుణకు పాత్రులగుచున్నారు.
*"ద్వినేత్రం , ద్విభుజం , శాంతం , జటామస్తక శోభితం ,*
*వేదహస్త సమాయుక్తం , మందస్మిత ముఖాంబుజం ,*
*సర్వానుగ్రహ దాతారం , సర్వాభీష్ట ఫలప్రదం.*
*సర్వనివారణ శోభాధ్యం శాస్తారం శరణం భజే”*
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*