శ్రీ మహాశాస్తా చరితము - 77 | తారకాసురుడు స్వామియొక్క వాహనమగుట | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహాశాస్తా చరితము - 77 | తారకాసురుడు స్వామియొక్క వాహనమగుట | Sri Mahashasra Charithamu

P Madhav Kumar

తారకాసురుడు స్వామియొక్క వాహనమగుట

**సింహతారక నామానౌ సింహదంతి శరీరిణా*
*తదా దుర్గా మహా శాస్తోర్ వాహనత్వమ్ సమీషతు.*

బహుకాలమునకు పూర్వము క్షీర సాగర మధ్యమున తొమ్మిది దీవులు అత్యంత శోభాయమానముగా
ఉండెను. వీటిలో సాహసము అనుదీవి సుప్రసిద్ధమైనది. ప్రభాకరుడు అను పేరుగల రాజు ఈ దీవిని పరిపాలించుచుండెను. ఇతనియందు ధర్మము , సహనము , వినయము , కరుణ మున్నగు
చతుర్విధములైన సద్గుణములు మూర్తీభవించియుండెను. ఇతడు సుకుమారి అను పేరుగల వనితామణిని
వివాహమాడి , అనుకూలముగా దాంపత్యజీవనమును కొనసాగించుచుండెను పుత్రసంతాన ప్రాప్తిని
కోరి , అతడు శివుడిని తన చిత్తమునందు భావించి , పూజించుచుండెను. భగవదనుగ్రహము వలన
అతడికి నలుగురు కుమారులు జన్మించిరి. మొదటి సంతానము కవలలు , వారి పేర్లు శూరుడు , పద్ముడు , మిగిలిన కుమారుల పేర్లు సింహుడు , తారకుడు , ప్రభాకరుడు తన పుత్రులకు తల్లి దండ్రుల పేర్లను పెట్టెను. వారినందరిని రాజు భగవద్భక్తి గలవారుగా పెంచసాగెను.

జ్యేష్ఠుడైన శూరుడికి పట్టముగట్టి , అతడిని రాజుగా సింహాసనాధిష్ఠుని గావించెను. అతడు తన
కవల సోదరుడితో కలిసి ధర్మయుతముగా రాజ్యమును పరిపాలించెను. దానిని గాంచిన ప్రభాకరుడు
అత్యంత ప్రమోదమునందినవాడై , తపస్సు చేయుటకై అడవులకేగెను. తండ్రివలె కుమారులు సైతము తపోనిష్ణా గరిష్ఠులై , నీతివంతులై రాజ్యపరిపాలనము గావించసాగిరి.

ప్రభాకరుడి కుమారులలో తారకుడు మహాశాస్తా మీద అగణితమైన భక్తి తత్పరతలు ,
గలిగియుండెను. అనుదినమూ , ముక్కాలముల యందునూ శాస్తాను పూజించుచుండెను. కవలలైన వారిలో శూరుడు అచ్యుతుడిని , సింహుడు అంబికను ఆరాధించుచుండిరి. భగవంతుడి మీద
అచంచల భక్తి విశ్వాసములు గలవారికి , సద్గురువు యొక్క సహాయసహకారములు అవశ్యము లభించును. ఇది తథ్యము ఈ మాటకనుగుణముగా భగవద్భక్తులైన ఈ రాకుమారులకు పరమపథమును
చూపుటకొరకు ఉత్కృష్టుడైన ఒకశివయోగి అచ్చటికి విజయము చేసెను.

వృషభయోగి అను పేరుగల ఆ తాపసుడు తారకుడు కలిసెను. అతడు మునిని సాదరముగా ఆహ్వానించి , నమస్కృతుల నందించెను. అతడికి ఉత్తమమార్గమును జూపనెంచిన ఆ మునిపుంగపుడు ,
అతడికి హరిహరులకు ఉద్భవించిన పుత్రుడిని గూర్చియు , ఎవరి పేరువిన్నవెంటనే సకల పాపములు హరించునో అట్టి మహాశాస్తాను గురించియూ , తారక బ్రహ్మస్వరూపుడైన స్వామి యొక్క వాహనము
అయిన శ్వేతగజమును గూర్చియు వేనోళ్ల కొనియాడెను.

దేవతలకు సైతము అందుబాటులో లేని ఆ పరమాత్మ శాస్తాగా అవతరించెను. అతడి దివ్య శరీర భారమును మోయగల అదృష్టభాగ్యము ఆగజరాజు పొందగలిగెనుకదా ! ఆహా ! అతడి భాగ్యమే
సద్భాగ్యము ! ఆ గజరాజు యొక్క ఔన్నత్యము ఇంతింతయని మాటలలో వర్ణించుటకు వీలుకాదు.
చతుర్యుగములను పరిసమాప్తిగావించు మహిమ గలిగిన వాడూ పరమాత్మ స్వరూపుడైన స్వామి ప్రపంచము సమస్తమూ పరమాత్మలో లీనమైపోవు సమయమున , ప్రళయము సంభవించును. సప్తసముద్రములూ ఉప్పొంగి , సమస్త భూమండలమును జలమయము గావించును. అట్టి
సమయమున , లోకములను కాపాడుటకై సృష్టి , సంరక్షణ , విలీనము అను ప్రతికార్యముల యొక్క
మహా భారమును వహించిన పరమాత్మ స్వరూపుడు అటువంటి మహామహిమాన్వితుడూ , అఖిలాండ
బ్రహ్మాండనాయకుడైన శాస్తాకు వాహనముగా అమరిన ఆశ్వేత గజము ప్రళయకాలమున తన
తొండముతో నీటిని స్వీకరించి , భూమిమీద గల ప్రాణులన్నింటిని సంరక్షించును.

సచ్చిదానంద స్వరూపుడైన శాస్తా అధిరోహించు దివ్యవాహనము అయిన ఆ శ్వేత గజరాజము
యొక్క అదృష్టగరిమ ఇంతింతయని వర్ణింప మాటలలో వీలుకాని విషయము , అని ఆ ముని పుంగవుడు వివరించెను. పరమాత్మ భారమును మోయగల వాహనము కాగోరినవాడై తారకుడు నియమనిష్టానుసారముగా తపస్సు చేయవలెనని నిశ్చయించుకొనెను.

ఇదే విధముగా , అగస్త్యుడి ఉపదేశానుగుణముగా , శూర పద్ములిరువురూ షణ్మఖుడి వాహనములైన
కుక్కటము మయూరము , సింహూడు అంబికాదేవి వాహనమైన సింహము కాదలచినవారై ఘోర
తపస్సు నాచరించి తీరవలయునని తీర్మానించుకొనిరి. రాజ్యపరిపాలన భారమును బావమరదులు
వహించునట్లుగా గావించిరి. తమ సర్వస్వమునూ త్యజించిన వారై , శ్రీశైలవనపుదేశమును చేరుకొనిరి.

సోదరులు నలువురూ ఒక్కటిగా కూడి పంచాగ్నిని జ్వలింపజేసి , ఆ జ్వాలల మధ్యమున అనేక సంవత్సరముల కాలము తపమొనరించిరి. వీరిట్లు తపస్సు చేయుచుండిన సమయమున , ఒక
పర్యాయము హిమాలయము మీద పరమ శివుడి తాండవనృత్యమును గాంచవలయునన్న
కుతూహలముతో విష్ణువు , అయ్యప్ప , అంబిక , స్కంధుడు , శాస్తామున్నగు దేవతా ప్రముఖులెందరో
తరలివచ్చిరి. వారు తమతమ వాహనములను బాహ్యప్రదేశములలో వదలిపెట్టి , మహేశ్వరుడి సన్నిధిని సమీపించిరి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow