దశముఖశాస్తా
సాక్షాత్ శ్రీమన్నారాయణుని యొక్క అంశావతార రూపమైన పృధు మహారాజు యొక్క వంశీములలో అతడికి మనుమడైన ప్రాచీన బృహస్ అను రాజు ఉండెను. అతడు సూక్ష్మ జ్ఞానము కలవాడు , సకల కళాసామ్రాట్టు అందువలన మొదటి ప్రజాపతిగా గౌరవము పొందెను.
అతడు కాళిందినదీ తీరమున నుండి రాజ్యపరిపాలనమును గావించుచుండెను. సమద్ర రాజుయొక్క కుమార్తె అయిన సర్ణ అను కన్యకామణిని వివాహమాడెను. అతడికి మహాశాస్తా అనిన ఆరాధనా భావము అత్యధికము ' మొదటినుండి అనేకములైన యజ్ఞయాగాదులను నిర్వహించుచుండెను.
మన యొక్క ఇష్టాభీష్టములన్నియు నెరవేర్చుకొనుటకు యజ్ఞ యాగములను చేయుట యొక్కటే ఉత్తమమైన మార్గమని రాజు యొక్క ప్రగాఢ విశ్వాసము. ఈ కారణమువలన అతడు లెక్కకు మించి యజ్ఞములను చేయుచు , అనేక మృగములను బలి ఇచ్చుచుండెను. అతడిలో మదగర్వము అధికముకా జొచ్చెను. క్రమముగా , భూభాగమంతయు ఆరాజు గావించు యాగబలుల తర్పణముతో నిండిపోవునట్టి దుస్థితి కలిగెను.
సర్వజన హితుడైన నారదమునీంద్రుడు ఆ రాజుకు హితమును ఉపదేశింపదలచినవాడై రాజాంతఃపురమునకు ఏతెంచెను. ఆమునిపుంగవుని సాదరముగా ఆహ్వానించి , సత్కరించెను. అతడిని ఉచితాసనము మీద ఆసీనుడుగా జేసి , తనకు హితవు జెప్పుమని వేడెను.
*"రాజా ! నీవు సారెసారెకు యజ్ఞయాగములు నిర్వహించుచున్నావు. వాటి వలన నీకు కలుగు ప్రయోజనమేమి ? ఇహలోక సుఖముల మీద మనస్సును లగ్నము గావించినచో నీకు ముక్తి ఏవిధముగా లభించును ?"* అని హితబోధగావించెను.
ముని పలుకులను విని రాజు బాధపడుచు *“తాపసోత్తమా ! ప్రజాపతిగా పేరు పొందిన నేను ప్రజలను సృష్టింపవలయునుగదా. కనుక నేను ఐహిక భోగములమీద వ్యామోహమును పెంచుకొంటిని. యజ్ఞ కార్యములను నిర్వహించుటవలన మాత్రమే నాకు సద్గతి లభింపదా ? అటులయిన , నేనిక నేమి చేయవలయును ? నాయీ అజ్ఞానమును పారద్రోలి హితమును చేకూర్చుము. అని వేడెను.
*నారదముని ఆ మహారాజుకు శాస్తా యొక్క గుణవైశిష్ట్యమును గూర్చి విశదీకరించెను. లౌకిక జీవితమునకు సంబంధించినంతవరకూ పరిమిత భోగములను జ్ఞానమార్గము ద్వారా మోక్షమును ఇచ్చునటువంటి మహిమ గలవాడు శాస్తా" అని అతడి గొప్పదనమును గూర్చి తెలిపి , తత్త్వోప దేశముగా , పాండ్యరాజులకు సంబంధించిన యొక కథను చెప్పి , లోక మాయను గురించి వివరించెను. ఆత్మవిచారము చేసి కాని , ఈదేహము మీద వ్యామోహమును పెంచుకొనవలదని రాజుకు ఉద్భోధ గావించెను. అటుపిమ్మట , లీలానాటక సూత్రధారి యగు శాస్తా యొక్క రూపములలో ప్రబలమై మొప్పుచున్న దశముఖ స్వరూపుజడైన శాస్తా యొక్క ప్రాశస్త్యమును గూర్చి వేనోళ్ల కొనియాడెను. పది తలలు గలిగిన శాస్తాను ఆరాదించి , అతడి అనుగ్రహమును పొంది , సంతాన వంతుడవగుదువుగాక"* అని ఆశీర్వచనములు పలికెను.
రాజు నారదముని యొక్క ఆదేశానుసారము నడచుకొని , విధిప్రకారము శాస్తాను ఆరాధించెను. అతడి దయకు పాత్రుడై , ఒకే విధమైన ముఖవర్చస్సుతో ప్రకాశించు పదిమంది కుమారులను పొందెను. దైవాను గ్రహమువలన జన్మించిన కుమారులు *"ప్రచేతసులు"గా* పేరొందిరి. రాజ్య నిర్వహణ నిమిత్తమై వారందరూ విలువిద్యను , అస్త్రశస్త్రాది విద్యలను అభ్యసించిరి , పరమపదమును చూపునట్టి ఆధ్యాత్మిక విషయములను గూర్చి తెలుసుకొనిరి. తపోనిష్ఠ యందును గరిష్ఠులుగా పేరుపొందిరి.
కుమారులను ఆశీర్వదించి పంపించుచు రాజు వారిని దక్షిణ ప్రాంతమునకు వెళ్లి ప్రజలను సృష్టించమని ఆదేశించెను. నారదుడి ఉపదేశము ననుసరించి ఆత్మవిచారము చేసికొన దలచినవాడై సన్యాసమును స్వీకరించెను. భగవానుడి శ్రీచరణములను స్మరించుకొనుచు , ఇహలోక బంధనములు తొలగించుకొని , చివరికి మోక్షమును పొందెను.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*