వడుగనాథుడు శాస్తా పరివారమగుట*
ఒకానొక పర్యాయము , కావేరీనదీ సంగమస్థలమున , మెయ్యాట్రూర్ అను ఊరియందు వడుగనాథుడను పేరుగల సిద్ధుడు వసించుచుండెను. ఇతడు మహాశాస్తా పరమభక్తుడు. ఇతడిని భైరవుడి అంశగా పేర్కొందురు.అప్పుడు , నీలిమలలో సాన్నిధ్యము గల (నెలకొనియున్న) శాస్తా అనుదినము తన భార్యామణితో బయలుదేరి వెళ్లి , పొన్ని నదిలో స్నానము చేసి , ఆనంద విహారము సలుపుచుండెడివాడు.
మంత్ర , తంత్రములలో ఆరితేరిన వడుగనాథుడు శాస్తా దంపతుల విహారమును గూర్చి తెలిసికొని , అతడిని పూజింపవలెనన్న కోరికతో నిరీక్షించుచుండెను. వడుగనాథుడు మంత్రశాస్త్రము నెరిగిన సిద్ధుడు. శాస్తా మీద అతడికి గల భక్తిశ్రద్ధలు అపారమైనది. అతడిని అనుగ్రహించుట కొరకై శాస్తా ఆనాడు అచ్చటనే నిలచిపోయెను.
వడుగనాథుడిమీద అనుగ్రహమును ప్రదర్శించుటకై శాస్తా మొదట నిలిచిన స్థలము *'వడరంగము'*
పిదప కుమారాక్షి అను స్థలమునకు వేంచేసి , మెయ్యాట్రూరులో అతడికి దర్శనమొసగెను.
ఎంతో పుణ్యము చేసికొన్నగాని లభింపని శాస్తాదర్శనము వడుగనాథుడికి లభించెను.
సంతోషముతో అతడి మేనంతయు పులకరించిపోయెను. ఆనంద సాగరములో ఓలలాడి వేవోళ్ల
శాస్తాను స్తుతించెను.
*"అరుణోదయమగు సమయమునకు శబరిమలకు చేరుకొనవలసియున్నది. అట్లు కాని యెడల , అరుణోదయమగు వేళ నేనెచ్చట నుందునో , అక్కడే నిలిచి పోవుదునుగాక”* అని శాస్తా ప్రతిజ్ఞ
చేసెను. ఆ వాగ్దానము ప్రకారము వడుగనాథుడి కొరకు మెయ్యాట్రూరులో నిలిచి పోయినందువలన , అక్కడే స్థిరముగా నివాసమేర్పరచుకొనెను.
తన పొరపాటును గ్రహించిన వడుగనాథుడు , స్వామి వద్ద క్షమాపణ కోరెను. తన భక్తుడికి
సంతోషమును కలిగింప వలయునని , అచ్చట వెలసిన శాస్తా తనకు భక్తులమీదగల ప్రేమాభిమానములను తన్మూలమున వెల్లడించెను. తాను భక్తజన వశుడనని చాటెను. ఆర్కాడు అను ప్రదేశములో , భక్తరత్నమై వెలసిన వడుగనాథుడిని అయ్యప్ప తన పరివారములో ఒకరిగా నియమించెను.
వడుగనాథుడి యొక్క విన్నపమును మన్నించి , శాస్తా చివరికి తన దేవి యగు స్వర్ణాంబికతో
అచ్చట వెలసి , స్వర్ణాంబికా సమేత రాజశాస్తాగా ఆనందతాండవ పురములో నెలకొనెను.
దీనినే *"వచ్చినదేమో వడ రంగము , నిలిచిన దేమో కుమరాక్షి , నివాసమేర్పరచుకొన్నదేమో మెయ్యాట్రూరు , భక్తుడిని తనలో లీనము గావించుకొన్న దేమో ఆర్కాడు , అమరినది ఆనంద తాండవపురము”* అని పేర్కొందురు.
*ఆనంద తాండవపురే కృతవాసమ్ సుందరాంబమోపేతమ్*
*దండాయుధ ధరమనిశమ్ కలయే శాస్తార మిష్టతమ్ హృదయే*
*శ్రీవడుగనాథ భక్తయా స్వీకృత సహ్యాద్రి జాతటావాసమ్*
*శిక్షిత దుష్టజనమ్ భువిపాలిత భక్తమ్ నమామి శాస్తారమ్.*
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
