శాండిల్యముని శాస్తా కటాక్షమును పొందుట*
వేదాధిపత్యమును వహించి విద్యుక్తధర్మమును నెరవేర్చుచున్న అగ్నిభగవానుడికి మువ్వురు సహోదరులు ఉండిరి. యాగనిర్వహణ సందర్భములలో ప్రేల్చబడునట్టి హవిర్భాగములను గొనిపోయి ,
ఆయాదేవతలకు సమర్పించుట ఆ సోదరుల యొక్క విద్యుక్త ధర్మము. బృహత్తరమైన ఈకార్య నిర్వహణా భారమును మోయజాలక కాలక్రమేణా ఆ సోదరులు తమ అసువులను గోల్పోయిరి.
అగ్నిదేవుడు దుర్భరమైనట్టి తన సోదరుల శాశ్వత వియోగమును భరింపజాలక నైరాశ్యభావముతో
వైరాగ్యమును పెంపొందించుకొని అమరలోకమునుండి బయలుదేరి , ఒక అటవీ ప్రాంతమును చేరి
అచ్చట తన నివాసము నేర్పరచుకొనెను. అగ్ని దేవుడిని కానక దేవతలందరూ తల్లడిల్లుచు. అతడి
కొరకై అన్నిచోట్లనూ అన్వేషింపదొడగిరి. అడవిలో ఒక బోయకులజుడు భార్యాసమేతుడై జీవనము
సాగించుచుండెను.
ఆ దంపతులకు మూడు సంవత్సరముల వయస్సులో నొక బాలిక గలదు. ఒకానొక
దుర్దినమునందు , ఆ బాలిక ఒక కఠోర విష సర్పము కాటుకు గురియై ప్రాణములను త్యజించెను. కుమార్తె మరణమునకు తల్లిదండ్రులు పరివేదనమును చెందినవారై దిక్కులు ప్రతిధ్వనించునట్లుగా
రోదింపసాగిరి. వారి దీనాలాపములు , ఆ అడవిలోనే నివసించుచున్న అగ్ని దేవుడి హృదయమును
కరగించి వేసినవి.
*'నేను నా సహోదరులను శాశ్వతముగా పోగొట్టుకొని తీవ్రవేదనకు గురియైతిని. తమ గారాల తనయ యొక్క శాశ్వత వియోగమును తల్లిదండ్రుటెట్లు భరింపగలరు. నాయొక్క యోగబలమును ప్రయోగించి , ఈ బాలిక మృత దేహములో ప్రవేశించి ఆమెను బ్రతికించుదును గాక'* అని దృఢ
నిశ్చయము గావించుకొని , ఆ బాలిక శరీరములో ప్రవేశించెను.
తత్ ప్రభావము వలన , ఆ బాలిక ప్రాణములతో లేచి కన్నులు తెరచి చూచినది దైవాను
గృహమువలననే తమ కట్టి భాగ్యము లభించినదని తలచి బోయ దంపతులు ఆనంద సాగరములో ఓలలాడిరి వారి యొక్క సంతోషపరవశత్వమును గాంచిన అగ్ని దేవుడు తానూ సంతృప్తి
చెందినవాడై , ఆ బాలిక రూపములోనే పెరుగ సాగెను.
కాలము గడచుచుండగా , ఆ బాలిక పెరిగి పెద్దదై యౌవ్వనవతి అయ్యెను. ఆమె దేహములో
నున్నది. దివ్యతేజోమయ స్వరూపుడైన అగ్ని దేవుడుకదా ? అందువలన , ఆమె అనుపమానమైన
రూపలావణ్యములతో శోభాయమానముగా ఉండెను.
ఒకపరి , తపోనిష్ఠాగరిష్ఠుడైన కాశ్యపమహాముని ఆ అటవీ మార్గమున పయనించుచుండెను.
అపురూప సౌందర్యవతియైన బోయవనిత ఆముని పుంగవునికి ఎదురయ్యెను. ఆ లలనామణి సౌందర్యమునకు మహర్షి మోహపరవశుడయ్యెను. మదనుడి శరములతడిని బాధింపజొచ్చినవి.
వాటి ధాటికి తాళజాలక తన వలపు నామెకు వెల్లడించెను. తాను నిజమునకు స్త్రీని కాదనియు స్త్రీరూపములో నున్న అగ్నిదేవుడిననియు ఆయువతి పలువిధములుగా మునీశ్వరుడికి నచ్చజెప్పియు , ఆమె ప్రయత్నము నిష్ఫలమయ్యెను. ఆమె మాటలన్నిటిని పెడచెవిని బెట్టి , కామోద్రేకుడై బలాత్కారముగా
ఆమెను అనుభవించెను. తత్ఫలితముగా స్త్రీ రూపములో నుండిన అగ్నిదేవుడు సద్యోగర్భమును
దాల్చెను తక్షణమే , వారికి ఒక కుమారుడు అవతరించెను.
కుమార జననమును గాంచిన మహర్షి సంతోషముతో ఉప్పొంగి పోయెను. అతడికి శాండిల్యుడు
అని నామకరణము గావించెను. అగ్ని దేవుడు నిజస్వరూపమును దాల్చి , శాండిల్యుడికి తన దివ్యాశీశులను అందించెను. అంతలో , అగ్ని భగవానుడి కొరకు అన్వేషణమును సాగించుచుండిన
దేవతలందరూ అచ్చటికి విచ్చేసి , అతడిని దేవలోకమునకు మరలి రమ్మని ఆహ్వానించిరి. కాశ్యప మహాముని కూడా అగ్ని దేవుడి వెంట అమరలోకమునకేగెను. విద్యుక్త ధర్మములను సక్రమముగా
నెరవేర్చుమని అగ్ని దేవుడికి హితోపదేశము నొనరించెను. పిదప , చాండిల్యుడిని తనవెంట గొనిపోయెను.
శాండిల్యుడికి బాల్యము నుండియు మహాశాస్తామీద భక్తి భావము కలుగువిధముగా కాశ్వపుడు అతనిని పెంచసాగెను. అతడికి ఉపనయము గావించిన పిమ్మట మహాశాస్తా యొక్క ప్రాశస్త్యమును ,
దివ్య మహిమను గూర్చి బహువిధములుగా విశదీకరించెను. సమస్త లోకముల యందునూ ,
అణువణువుననూ నిండియున్న భగవానుడు *'శాస్తా'* అనియు , సృష్టి - సంరక్షణ - సంహారము
అను పంచవిధములైన బృహత్కార్యములను నిర్వహించుచుండు ననియు వివరించెను.
కన్నతండ్రి మూలమున శాస్తా యశోప్రాభవమును తెలిసికొన్న శాండిల్యుడు , అతడి అనుజ్ఞనుగైకొని ,
స్వామిని గూర్చి తపస్సు చేయవలయునని దృఢనిశ్చయుడై కానలకేగెను. అచ్చట నొక కుటీరమును నిర్మించుకొని , శరణాగత రక్షకుడైన శాస్తాను నిరంతరము ఆరాధించుచుండెను. శాస్తా చరిత్రను
అభివర్ణించుచు , అతడి సహస్రాధిక నామములను కొనియాడుచు వాటిని అనేక రకములైన
పాటలుగా మలచి అనుదినము కీర్తించుచుండెను. ఇట్లు కాలము గడుచుచుండగా , శాండిల్యుడి మనస్సులో శాస్తా యొక్క విశ్వరూపమును కన్నులారా వీక్షించవలయునన్న కోరిక మొలకెత్తి , పెరిగి
పెద్దదై శాఖోపశాఖలతో కూడిన ఒక మహావృక్షము వలె నిలిచినది.
తన పరమభక్తాగ్రేసరుడి యొక్క మనోభీష్టమును నెరవేర్చవలయునన్న తలంపుతో , శాస్తా
ప్రసన్నుడై శాండిల్యుడి యెదుట సాక్షాత్కరించెను.