పదినెట్టాంపడి అను పదునెనిమిది సోపానములలో గల ఆంతర్యము*
శబరిమల దేవాలయ ముఖ ద్వారమున పద్దెనిమిది సంఖ్యగల మెట్లుగలవు. వీటికి గలప్రాశస్త్యమును గూర్చి తెలుసుకొనవలసిన అవశ్యము గలదు. మన దైనిక జీవన యాత్రలో
సాఫల్యమును పొందవలెనన్న , ఈ మెట్లు విషయములో విశదమగుచున్న పరమార్థమును అందరూ
తెలుసుకొనవలయును. ఇవి మనకు సత్యమార్గమును ప్రబోధించుచున్నవి , కనుక వీటిని మనము
శరణు కోరవలెను. భక్తిరసపరవశులైన జనులు , స్వామిని దర్శించుటకు వెళ్లునప్పుడు స్వామీ !
అయ్యప్పా ! నీ శ్రీ చరణములే మాకు రక్ష ' అనుచు చేయునట్టి నినాదములు మేనుగగుర్పొడుచునట్లుగా
చేయును. భక్తులు తమ సర్వస్వమూ స్వామియే అని పరిపూర్ణ విశ్వాసముతో స్వామి సన్నిధికి బయలు దేరివెళ్లుదురు. ఈ సువర్ణ సోపానములలో వెల్లడగుచున్న తత్త్వమును గూర్చి తెలిసికొనవలసిన
ఆవశ్యకత గల దనవచ్చును. దీనియందలి పరతత్త్వము అవాజ్మాసగోచరమైనదనవచ్చును.
ఈ అష్టాదశ సోపానములలో నిబిడియున్న సంకల్ప విషయములను గూర్చి తత్త్వవేత్తలు
వివిధములైన అభిప్రాయములను వెల్లడించి యుండుట గమనార్హము. వీటిలో కొన్ని ప్రధాన
విషయములను గూర్చి పరిశీలించగలము.
1. మన భారతీయులకు అష్టాదశ పురాణములుగలవు.
'మ'కారముతో ప్రారంభమైనవి రెండు
మత్స్యుపురాణము , మార్కండేయ పురాణము ,
'భ' కారముతో ప్రారంభమైనవి నాలుగు భవిష్యపురాణము , భాగవత పురాణము , బ్రహ్మాండపురాణము , బ్రహ్మవైవర్తపురాణము ,
'వ' కారముతో ప్రారంభమైనవి నాలుగు వాయుపురాణము , వరాహ పురాణము , విష్ణుపురాణము ,
వామనపురాణము ,
'న' కారముతో మొదలైనది నారదీయ పురాణము ,
'లి' తో మొదలైనది.
లింగపురాణము
'ప' కారముతో ప్రారంభమైనది. పద్మపురాణము ,
'గ' కారముతో మొదలైనది. గరుడ పురాణము ఇవి పద్దెనిమిది పురాణములు.
భగవాన్ శ్రీవ్యాస మహర్షి ఈపురాణములలో వేదవిషయములను విశదపరచియుండెను ,
మానవుడు పరమపదప్రాప్తిని పొందుటకై ఉపయుక్తమగురీతిలో , తత్త్వవిషయములు అనేకము ఈ పురాణములలో గర్భితమైయున్నది. అయ్యప్ప వెలసిన శబరిమలకు ప్రవేశించవలెనన్న , ఈ
పదునెనిమిది మెట్లను అధిరోహించవలయును వీటి సంఖ్య ఈ పద్దెనిమిది సంఖ్యను
తలపింపజేయుననుట విశేషము. మలయాళ మహాకవి వళ్లత్తోళ్ , ఈ సోపానములు ఆమ్నాయ
పర్వతము నుండి ప్రవహించు నదులను తలపింప జేయుచున్నట్లుగా ఉన్నాయని వచించియున్నారు.
2. కైవల్య ప్రాప్తి లేక మోక్షమును పొందుటకు మానవుడు దాటి వెళ్లవలసిన మెట్లు పదునెనిమిది.
ఈ సోపాన సంకల్పములలో మోక్షసాధనను గూర్చిన వివరములు వెల్లడగును.
జ్ఞానేంద్రియములు , కర్మేంద్రియములను చేర్చిన దశేంద్రియములు అగును. శ్రోత్రములు ,
కర్ణములు , నాసిక , రసనము , చర్మము , ఇవి
జ్ఞానేంద్రియములు , హస్త ద్వయము , పాదములు ,
గుహ్యేంద్రియము , ఉపస్థము , వాక్కు ఇవి అయిదు కర్మేంద్రియములు ఎవాక్కును జ్ఞానేంద్రియముగాను , కర్మేంద్రియము గాను పేర్కొందురు. పంచప్రాణములు మనస్సు బుద్ధి , అవిద్య , సూక్ష్మ కారక శరీరములను బాధించునపుడు గోచరించు ఘట్టములు పదునెనిమిది
కదా ? (పంచప్రాణములు 1. ప్రాణము
2. అపానము,
3. సమానము
4. ఉదానము)
శబరిమల కోవెలలో 18 మెట్లను పదునెనిమిది తత్వములుగా పదునెనిమిది ఘట్టములుగా
చేర్చుకొనువారి యొక్క సంఖ్య అధికమని చెప్పవచ్చును.
3. సృష్టి మర్మమును గూర్చి ఈ పదునెనిమిది సోపానములు వెల్లడించునట్లుగా అమరినవి.
ఒకటి , మూడు , మూడు సంఖ్యను గుణించినప్పుడు తొమ్మిది సంఖ్య వచ్చును , దానిని
ద్విగుణీకృతము గావించిన యెడల పదునెనిమిది సంఖ్య వచ్చును. పదునెనిమిదిని రెండుగా వర్గీకరణము గావించినయెడల వచ్చు సంఖ్య తొమ్మిది. సకల సృష్టి విశేషములు *'తొమ్మిది అను సంఖ్యలో ఇమిడియున్నవి. ఈ తొమ్మిది సంఖ్య నవేంద్రియములను తెలుపుచున్నది.
దశేంద్రియములని మనము పేర్కొనుదుము , కానీ వాస్తవమునకు అవి తొమ్మిది ఇంద్రియములు ,
వాక్కు రెండింటిలోను చేరుచున్నదని మునుపే తెలిసికొనియున్నాము. ఈ విధముగా పద్దెనిమిది
సోపానములలో ఇమిడియున్న తత్త్వము శాశ్వతమైన సత్యము వేద శాస్త్ర పురాణములన్నియు ,
సత్యము యొక్క ప్రాధాన్యమును వెల్లడించుచున్నవి.
4. వేదాంత రహస్యములను వివరింపగోరువారు , *'యథార్థవిద్య'* అను దానిని పదునెనిమిద
శాఖలతో విస్తరించిన ఒక మహావృక్షముతో పోల్చుచున్నారు. ఈ శాఖలను గూర్చి పరిశీలింతము.
*వేదములు నాలుగు:* ఋగ్వేదము , యజుర్వేదము , సామవేదము ,
అధర్వణ వేదము
*వేదాంగములు ఆరు :* శిక్ష , కల్పము , వ్యాకరణము జ్యోతిషము ఛందస్సు అర్థశాస్త్రము ,
ఆయుర్వేదము , న్యాయశాస్త్రము , మీమాంసము , గాంధర్వము , పురాణము మున్నగునవి.
సూక్ష్మ దృష్టితో పరిశీలించినచో , విద్య యొక్క పదునెనిమిది తత్త్వములను గూర్చి ఈ
సోపానములు మనకు సూచించునన్నావని చెప్పవచ్చును , శ్రీధర్మశాస్తాకు దీనిని సమన్వయించి
వివరించు న్యాయములు కూడా ఉన్నవి. సమస్తమైన జ్ఞాన విజ్ఞానములకూ నిలయుడై
విరాజల్లుచున్న మహనీయమూర్తి శ్రీ శాస్తా ! విద్యావంతులైనవారు ,
జ్ఞానులు , మతానుయాములు
ఈ విషయమును బలపరచుచున్నారు.
