శ్రీ మహాశాస్తా చరితము - 97 | శ్రీ మహాశాస్తా వ్రతములు | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహాశాస్తా చరితము - 97 | శ్రీ మహాశాస్తా వ్రతములు | Sri Mahashasra Charithamu

P Madhav Kumar

శ్రీ మహాశాస్తా వ్రతములు*

హరిహరపుత్రుడైన శ్రీశాస్తాను ఉపాసించు భక్తులు నియమానుసారముగా వ్రతముల
నాచరింపవలయును *బుధవారవ్రతము , శనివార వ్రతము , ఉత్తరా నక్షత్ర వ్రతము*

1. ఈ వ్రతమును
పాటించు భక్తులు ఉత్తరానక్షత్రమునాడు కానీ , బుధవారముకానీ వ్రతమును ఆచరింపవలెను.

మొదటి రోజు పగటి పూట మాత్రమే ఆహారమును గైకొనవలయును రాత్రి ఉపవాసమును
పాటించవలెను. వేకువజామున నిద్రనుండి మేల్కొని , నిత్యకృత్యములను నెరవేర్చుకొని జల సంసేవనము మాత్రమే గావించి వ్రతము నాచరించుట అత్యుత్తమము , రోజంతయూ పారాయణము ,
జపము , ధ్యానము మున్నగువాటిని చేయుచుండవలయును. అయ్యప్ప దేవాలయమున కేగి పూజింపవలెను. రాత్రి సమయాలలో నిద్రమేల్కొని , అయ్యప్పను ధ్యానించవలెను.

మరుసటి రోజు ,
వేకువనే నిద్రమేల్కొని , స్నానమునాచరించి , శాస్తాను సేవించి , భక్తజనులందరితో కలసి భోజనము చేయవలెను. ఆ దినము పగటి నిద్రను మాని , రాత్రి మాత్రమే నిద్రించవలెను.

*ఉత్తరానక్షత్ర వ్రతాన్ని పాటించువారు చైత్రమాసమున , వచ్చు ఉత్తర నక్షత్రముతో ప్రారంభించి , ఫాల్గుణ మాసములో వచ్చు ఉత్తర నక్షత్రమునాడు శాస్తా యొక్క జన్మదినమున పరిసమాప్తి గావింపవలెను.*

దీనినాచరించుట శక్యము కాని యెడల , ఉత్తర నక్షత్రము వచ్చు దినములలో అనుసరింపవచ్చును.

*ఫాల్గుణమాసము ఉత్తర నక్షత్ర వ్రతమును ఆచరించువారు , రెండుదినములు ముందుగానే వ్రతమును ప్రారంభింపవలయును.*
ఉదయముననే నిద్రలేచి , నిత్యకృత్యములను దీర్చుకొని , శాస్తాను
విధియుక్తముగా పూజింపవలయును. పగటి సమయములలో నిద్రింపరాదు.

మరియు , ఈ వ్రతమును చేయగోరువారు తమతమ గృహములలో నుండి కుండలలో పాలు ,
పెరుగు , నేయి లేతకొబ్బరినీళ్లు గొని నడచి రావలయును. దేవాలయముకేగి , శాస్తాను అభిషేకమును
గావించినయెడల అభిల దుఃఖములును ధూళితో సమానముగానగును. ఐహిక సంపదలు
సంప్రాప్తించును. అయ్యప్పస్వామి కరుణా కటాక్షవీక్షణము అందరిమీదను ప్రసరించునుగాక !

ఫాల్గుణమాసము ఉత్తరా నక్షత్రమున వ్రతమునాచరించువారు రాత్రి సమయంలో నిద్రింపరాదు.
శాస్తాయొక్క దివ్య చరిత్రమును , అద్భుత లీలలను పారాయణము చేయువలెను. మరుదినము
శాస్తాను పూజించి , ఉదయకాలమున ఆహారమును స్వీకరించి వ్రతమును ముగింపవలయును.
ఆనాడు పగటిపూట నిద్రింపరాదు. రాత్రి సమయము నిద్రింపవచ్చును.

ఇట్లు నియమనిష్టాపరులై అయ్యప్పస్వామిని కొలుచు భక్తులకు సంకల్ప సిద్ధి కలుగును. సమస్త
దుష్టశక్తుల ప్రభావము పరిపూర్ణముగా తొలగిపోయి , ప్రశాంతత కలుగును.

*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow