216. ఓ పంచభూతాల్లార నా స్వామి ఎక్కడా | Ō pan̄cabhūtāllāra nā svāmi ekkaḍā | అయ్యప్ప భజన పాటల లిరిక్స్
November 12, 2025
ఓ పంచభూతాల్లార నా స్వామి ఎక్కడా
ఓ సూర్య చంద్రుల్లారా మీరు జాడ చెప్పరా ॥2॥
ఆ దివిలో ఉన్నాడో, ఈ భువిలో వెలిసినాడో ॥2॥
ఓ పంచభూతాల్లార నా స్వామి ఎక్కడా
ఓ సూర్య చంద్రుల్లారా మీరు జాడ చెప్పరా ॥
యాదగిరి నరసింహ స్వామి, మంత్రాలయ రాఘవేంద్ర
శ్రీశైలంలో మల్లికార్జున — వీరున్నారు
మణికంఠుడు ఎక్కడా ॥2॥
చెట్టు పుట్టలో దాగి ఉన్నడా,
కొండల్లో పవళించుచున్నడా ॥2॥
చుక్కల్లోన ఇమిడి ఉన్నడా,
వెన్నెల వెలుగై వస్తున్నడా ॥
ఓ పంచభూతాల్లార నా స్వామి ఎక్కడా
ఓ సూర్య చంద్రుల్లారా మీరు జాడ చెప్పరా ॥
సమ్మక్క సారలమ్మ ధర్మశాస్త్ర దారి ఎక్కడా
కంచిలోన కామాక్షమ్మ, మధురలో మీనాక్షమ్మ ॥2॥
కన్యకా పరమేశ్వరిని అడిగ,
ధర్మస్థలము ఖాంభికనడిగా
తోటనిక్కల మాలిని అడిగ,
ఉనికి సుబ్రహ్మణ్యమును వేడగా ॥
ఇరుముడినే తలపై పెట్టుకొని,
ఎరుమేలివ వరుని చేరుకొని
అటుకులు బెల్లం మూట కట్టుకుని,
కాలినడకన అలగ చేరుకొని
అలగ నదిలో స్నానమాడుకొని,
మేడి పైన రెండు రాళ్లు కట్టుకొని
కఠినమైన ఆ కరిమళ గిరిని ఎక్కలేక
కుప్పకూలితి ॥
పంబా నదిలో స్నానమాడి,
కన్యమూల గణపతిని మొక్కితి
నీలిమల కొండను దాటి,
కాంతమలాగిరి చేరుకున్నితి
శరణుగుత్తి శబరిపీఠము,
బంగారు మెట్లను ఎక్కుకొని
కోటి సూర్య తేజము నిండిన
బంగారు రూపమును చూచితి ॥
🛕 హర హర శరణం అయ్యప్పా! 🛕
Tags
