రావనా సంధనాలో వెన్నెల అయ్యప్పకు వందనాలో వెన్నెల ||2||
రావనా సందనాలో వెన్నెల మణికంఠకు వందనాలో వెన్నెల ||2||
వెన్నెలో వెన్నెల శబరి కొండ వెన్నెల
|| రావనా సంధనాలో ||
శివ కేశవ తనుయుడంట వెన్నెలో వెన్నెల
సిరులిచ్చే దేవుడంట వెన్నెలో వెన్నెల
పంబ నది తీరమున వెన్నెలో వెన్నెల
జన్మించిన దేవుడంట వెన్నెలో వెన్నెల
మెడలో మణిహారముతో వెన్నెలో వెన్నెల
పందల రాజుకుదొరికి వెన్నెలో వెన్నెల
మనికంటుడాయేనమ్మ వెన్నెలో వెన్నెల
మహిమగల్ల దేవుడమ్మ వెన్నెలో వెన్నెల
పందల యువరాజమ్మ వెన్నెల
తను పావనా రూపుడమ్మ వెన్నెల వెన్నెల
|| రావనా సంధనాలో ||
శివుని వంటి మేధస్సు వెన్నెలో వెన్నెల
విష్ణువంటి తేజస్సు వెన్నెలో వెన్నెల
కలగలసిన బాలుడమ్మ వెన్నెలో వెన్నెల
కలియుగా పురుషుడమ్మ వెన్నెలో వెన్నెల
మాటరాని వారి నోట వెన్నెలో వెన్నెల
మాటనే పలికిస్తడంట వెన్నెలో వెన్నెల
నడవలేని వారినైనా వెన్నెలో వెన్నెల
అడవులు దాటిస్తడమ్మ వెన్నెలో వెన్నెల
శరణం అంటే చాలు వెన్నెల
శరాలన్ని తొలగిస్తడు వెన్నెల వెన్నెల
|| రావనా సంధనాలో ||
మహిమాన్విత మాల వేసి వెన్నెలో వెన్నెల
మండల దీక్ష చేసి వెన్నెలో వెన్నెల
ఇల్లు వాకిలి ఇడిచి పెట్టి వెన్నెలో వెన్నెల
ఇరుముడిని ఎత్తుకొని వెన్నెలో వెన్నెల
కాళ్ళే పుల్లైతున్నా వెన్నెలో వెన్నెల
తనువు సొమ్మసిల్లుతున్నా వెన్నెలో వెన్నెల
రాళ్ళు ముల్లు తగిలి ఒళ్ళు వెన్నెలో వెన్నెల
రక్తలే కారుతున్న వెన్నెలో వెన్నెల
తనను నమ్మి నడిచి వస్తే వెన్నెల
మన పాపాలే కడిగేస్తాడు వెన్నెల వెన్నెల
|| రావనా సంధనాలో ||
మకర సంక్రాంతి రోజు వెన్నెలో వెన్నెల
కాంత మలై కొండపైన వెన్నెలో వెన్నెల
మకర జ్యోతిగా వెలిగే వెన్నెలో వెన్నెల
వేగు చుక్క తనమ్మా వెన్నెలో వెన్నెల
జన్మలో ఒక్కసారైనా వెన్నెలో వెన్నెల
మకర జ్యోతి దర్శిస్తే వెన్నెలో వెన్నెల
ధన్యమంట మన జన్మ వెన్నెలో వెన్నెల
ఉండదంట మరు జన్మ వెన్నెలో వెన్నెల
ఆపదలను అంతము జేసే వెన్నెల
మన ఆపద్భాంధవుడంటా వెన్నెల వెన్నెల
రావనా సంధనాలో వెన్నెల అయ్యప్పకు వందనాలో వెన్నెల ||2||
రావనా సందనాలో వెన్నెల మణికంఠకు వందనాలో వెన్నెల ||2||
వెన్నెలో వెన్నెల శబరి కొండ వెన్నెల
|| రావనా సంధనాలో ||
