జై బోలో గణేష్ మహారాజ్ కీ — జై
ఘల్లు ఘల్లు ఘల్లునా రావయ్యా... ఘనముల అధిపతి గణపయ్యా... (కోరస్)
భళ్ళు భళ్ళు భళ్ళున లేవయ్యా... భజనల దళపతి బలమియ్యా... (కోరస్)
శరణం శరణం గజాననా... శివబాలా గజముఖ వదనా... (కోరస్)
🕉️ చరణం 1
పిండి బొమ్మకే పురుడు పోసినా తల్లి పార్వతమ్మా...
ప్రాణ ప్రదంగా నిన్ను చూసినా గౌరీ దేవతమ్మా...
తల్లి మాటనే జవదాటని తనయుడవే నీవయ్యా...
తండ్రి తానే అని తెలియక శివుడిని అడ్డగిస్తివయ్యా...
గౌరి సుతుడా గజాననా... గండర గండా గజవదనా... (కోరస్)
🕉️ చరణం 2
కోపమాగని శివుడు నీ శిరస్సును ఖండించేనయ్యా...
పార్వతి వేడగ నీ రూపము ఇక గజముఖమాయెనయా...
శివ పార్వతుల ప్రేమ సన్నిధిలో పెరిగిన గణపయ్యా...
నిరతము వారి సేవల్లోనే తరించినావయ్యా...
లంబోదరుడా గజాననా... లకుమికుడా గజముఖ వదనా... (కోరస్)
🕉️ చరణం 3
ముల్లోకాలు తిరగగా మూషిక వాహనమొచ్చేనయా...
ఎలుక నెక్కె ఈ ఏనుగు కథ భలే విచిత్రమేనయ్యా...
జ్ఞానజ్యోతులను వెలిగించగ ఇల గుణ గుణ రావయ్యా...
విజ్ఞాలను కలిగించక మమ్ముల దీవించాలయ్యా...
విజ్ఞ వినాయక గజానన... విజ్ఞాన ప్రదాయక గజవదనా... (కోరస్)
భళ్ళు భళ్ళు భళ్ళున లేవయ్యా... భజనల దళపతి బలమియ్యా... (కోరస్)
శరణం శరణం గజాననా... శివబాలా గజముఖ వదనా... (కోరస్ ×3)
