కీరవాణి రాగం : ఆది తాళం
సాకి :- కోటి జన్మల ఫలంఋ నీ నామస్మరణ
జపియించు నా మనము క్షణము క్షణము
రామా...కారుణ్యధామా నమో...నమస్తే.
పల్లవి :- శ్రీ రామ నీవేరా నా జీవము
ఓ రామ నీవేరా నా సర్వము -2 (శ్రీ రామ)
చరణం:- యుగయుగాలకు జగజగాలకు
ధర్మము చాటిన ధర్మావతారుడౌ -2
రాతిని నాతిగా చేసిన దొరవే -2
నీ సాటి దైవము ఇలలోన మాకెవరు. (శ్రీ రామ)
చరణం:- శరణాగత బిరుదాంకితుడౌ నీవు
శరణను వారిని కరుణించే హరివే -2
రఘపతి రాఘవ రాజారామా -2
రయముగ బ్రోవర సాకేతపురదామా. (శ్రీ రామ)
కోరస్ :- శ్రీ రామ్ జయరామ్ జయజయరామ్ -4 సార్లు
శ్రీ రామ్ జయరామ్ జయజయరామ్
సాకీ :- రామా......శ్రీ రామా......భద్రాచలరామా.
