గురు స్వామి దైవమే శరణమయ్యప్పా
బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నీవేనప్పా
తల్లి తండ్రి తర్లాలు స్థానము నీవేనప్పా
స్వామి అయ్యప్ప శరణమయ్యప్పా
స్వామి అయ్యప్ప శరణమయ్యప్పా
శబరిమల కొండల్లో తోడుగా ఉంటావప్పా ||2||
శరణాలను గుండెల్లో పలికించెదవోయప్పా ||2||
సన్నిధానమును చేర్చే బాధ్యత నీదప్పా ||2||
కన్నెస్వామినడిగడుగును కాపాడెదవోయప్పా
||గురువనె||
ఎరుమేలిలోనా ధర్మశాస్త నీవప్పా ||2||వనయాతర వెంటుండి నడిపిస్తావయ్యప్పా ||2||
అలుదకొండనెక్కించి ఆడిస్తావయ్యప్పా ||2||
కఠినమైన కరిమలను దాటిస్తావోయప్పా
||గురువనె||
పంపాలోన పాపలను కడిగిస్తావోయప్పా ||2||కన్నెమూల గణపతిని మొక్కిస్తావోయాప్పా ||2||
శరణగుత్తిలో శరములు గుచ్చిస్తావయ్యప్పా ||2||
పదునెట్టంబడి నెక్కించి జన్మధన్యం చేస్తివప్పా
||గురువనె||
