అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకురా
అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకురా
అమ్మానాన్నలను మించిన
దైవం సృష్టిలో లేదురా
అమ్మానాన్నలను మించిన
దైవం సృష్టిలో లేదురా
అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకురా
అమ్మానాన్నలను మించిన
దైవం సృష్టిలో లేదురా
నిను మోసిన నవమాసాలు
తనకు నీవు బరువనుకోదురా
చావుకు చేరువులో నీకు
జన్మ తాను నీకిస్తుందిరా
ఏడవనివ్వదురా .....తాను
నిదురే పోదురా ..........
ఏడవనివ్వదురా .....తాను
నిదురే పోదురా ..........
మనమెంత చేసినా ఆ రుణమూ తీరనే తీరదురా
అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకురా
అమ్మానాన్నలను మించిన
దైవం సృష్టిలో లేదురా
అలసిసొలసి పోయిన నీకు వుయ్యాలై తానూగేనురా
ముద్దూమురిపాలతో నీకూ
గోరుముద్ద తానయ్యెనురా
ఆకలిమరచెనురా నీ ఆకలి మరువదురా
తన ఆకలిమరచెనురా నీ ఆకలి మరవదురా
అమృతమైనా తాను తినకుండ నీకే పంచునురా
అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకురా
అమ్మానాన్నలను మించిన
దైవం సృష్టిలో లేదురా
సంసార సాగరమీది బ్రతుకు దారి చూపించునురా
గుండెనిండ భాదలువున్న కంటనీరు రానీయడురా
అలుపే ఎరుగడురా తనసుఖమే కొరడురా
అలుపే ఎరుగడురా తనసుఖమే కొరడురా
కన్నవాళ్ళు సుఖపడితే చాలని పూజలు చేయునురా
అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకురా
అమ్మానాన్నలను మించిన
దైవం సృష్టిలో లేదురా
వయసుడిగిన వారికి నీవు
కొడుకువై నీడివ్వాలిర
వారు కన్నకలలు ఎన్నో కల్ల నీవు కానియకురా
ప్రేమను పంచరా వారి మనసే త్రుంచకురా
ప్రేమను పంచరా వారి మనసే త్రుంచకురా
వారిదీవెన లేనిదే నీ
జన్మకు ముక్తి లభించదురా
అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకురా
అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకురా
అమ్మానాన్నలను మించిన
దైవం సృష్టిలో లేదురా
అమ్మానాన్నలను మించిన
దైవం సృష్టిలో లేదురా
అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకురా
అమ్మానాన్నలను మించిన
దైవం సృష్టిలో లేదురా
అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకురా | Am'manu maruvakurā nuvvu nānnanu viḍuvakurā
November 29, 2025
Tags