నీ మనసు మంచుకొండనయ్య తండ్రి గురుస్వామి"2"
ఏళ్ళ కొద్దీ మాల వేసి అయ్యప్పకు దాసుడైనవు
కోరస్.. అయ్యప్పకు దాసుడైనవు
కొండ దారినువను తెలుసి అందరికీ గురుస్వామి అయినవు"2"
కోరస్.. అందరికీ గురుస్వామి అయినవు
కన్నెస్వాములను చేరదీసి నిష్టా నియమాలు తెలిపి
సద్బుద్ధిని నేర్పినావు సజ్జనులుగా మార్చినావు
"అయ్యా గురుస్వామి"
బ్రహ్మగడియలనిీ వేళలో లేచి కన్నెస్వాములను నిద్రలేపి
కోరస్.. కన్నెస్వాములను నిద్రలేపి
సూర్య కిరణం పడకముందే సన్నిదానం శుద్ధి చేసి
కోరస్.. సన్నిదానం శుద్ధి చేసి
అయ్యప్ప స్వామి ముందర ఆవు నెయ్యితో దీపమెట్టి
నోట తిరగని శరణాలను ఎంత చక్కగ నేర్పినావు
"అయ్యా గురుస్వామి"
జన్మనిచ్చిన తల్లిదండ్రులే దైవాలని తెలిపినావు
కోరస్.. దైవాలని తెలిపినావు
టోటివాళ్లకి సేవ చేస్తే దైవమే నీ తోడు అన్నవు
కోరస్.. దైవమే నీ తోడు అన్నవు
అన్ని గుణములు నేర్పినావు ఆత్మస్తైర్యం పెంచినావు
ఆనందపూజ జీవితాలను అందరికి నువు పంచినావు
"అయ్యా గురుస్వామి"
మట్టి లాంటి మనుషులైన మండలం నీ చెంత ఉంటే
కోరస్.. మండలం నీ చెంత ఉంటే
మణికంఠుని మహిమ తెలిసి మహానీయుల జేసినావు
కోరస్.. మహానీయుల జేసినావు
మా చీకటైన జీవితాన వేలుగు రేకలు నింపినావు
దేవుడే మాకోసం పంపిన దైవధూతవు నీవయ్య
"అయ్య గురుస్వామి"
ఆపదన్నది తెలియకుండా అడవిదారిని నడిపినావు
కోరస్.. అడవిదారిని నడిపినావు
స్వామి నడిచిన దారి మాకు అణువు అణువు చూపినావు
కోరస్.. అణువు అణువు చూపినావు
పద్దెనిమిది మెట్ల మహిమ తెలియజేస్తూ ఎక్కించినావు
ఎన్ని జన్మల పుణ్యమో అయ్యప్ప స్వామిని చూపినావు
"అయ్య గురుస్వామి"
