కోనల్లో వెలిసి నాడయ్యా…
ముల్లోకాలు ఏలేవాడు
మూడు నామాలున్న వాడు
ఆపద మొక్కులందేవాడు
అవతారాలు గల్లవాడు —
కలియుగమున శ్రీ వెంకటపతియై
కోరిన వరములు నొసగేవాడు…
|| కొండల్లో వెలసి… ||
కొండల కురుమతి రాయుడు వాడుమల్దకల్ తిమ్మప్పేవాడు
ఆరు మల తిరుపతి రేడు వాడు
చిలుకూరి బాలాజీ వాడు —
ఇరువురి భామల పోరును వారక
తిరు వీధుల్లో తిరిగేవాడు…
|| కొండల్లో వెలసి… ||
అలివేలు మంగమ్మ జోడుబీబీ నాంచారమ్మకు తోడు
అన్నమయ్య సంకీర్తనలోని
అవనియంత వెలుగొందేవాడు —
వేయి నామాల అర్చనలో లేనోళ్ళు
పొగిడే వైకుంఠుడు వాడు…
|| కొండల్లో వెలసి… ||
గోవిందా గోవిందా వేంకటరమణ గోవిందా ||3||వేంకటరమణ గోవిందా సంకట హరణ గోవిందా
గోవిందా కన్న గోపాల కన్న
మాధవ కన్న ఎంగాల్ యాదవా కన్న
గోవిందా కృష్ణ గోపాల కృష్ణ
మాధవ కృష్ణ ఎంగల్ యశోదకృష్ణ
గోవిందా రాధే గోపాల రాధే
మాధవ రాధే ఎంగల్ బృందావన రాధే
గోవిందా రామ గోపాల రామ
మాధవ రామ ఎంగల్ అయోధ్య రామ
Fast
:గోవిందా గోవిందా వేంకటరమణ గోవిందా
వేంకటరమణ గోవిందా సంకట హరణ గోవిందా
