16. వందనాలు వందనాలయ్యో శ్రీ ఆంజనేయ | Vandanālu vandanālayyō śrī ān̄janēya | హనుమాన్ భజన పాటల లిరిక్స్
December 03, 2025
వందనాలు వందనాలయ్యో శ్రీ ఆంజనేయ
ఎన్ని వందనములు చేసిన ఉలకవు నను పలుకరిచవు
నేను చేసిన నేరమేమయ్యో శ్రీ ఆంజనేయ
నేను చేసిన నేరమేమయ్యో అభయాంజనేయ
పొద్దు పొద్దున నీదు నామము పఠన చేయని దినము లేదు
పఠన చేయని దినము లేదు
నేను చేసిన నెరమేమయ్యో శ్రీ ఆంజనేయ
నేను చేసిన నేరమేమయ్యో అభయాంజనేయ
లక్ష్మణుండు మూర్చగొనగా సంజీవిని తెచ్చినావు
సంజీవిని తెచ్చినావు
నేను చేసిన నేరమేమయ్యో శ్రీ ఆంజనేయ
నేను చేసిన నేరమేమయ్యో అభయాంజనేయ
రాముని రూపము నీవు గుండెలొన నిలిపినావు
శ్రీరామబంటువయ్యినావయ్యో శ్రీ ఆంజనేయ
నేను చేసిన నేరమేమయ్యో శ్రీ ఆంజనేయ
ఏడేడు సముద్రాలు దాటి లంకను చేరినావు
దాటి లంకను చేరినావు
రాక్షసుల దునుమాడినావయ్యో శ్రీ ఆంజనేయ
నేను చేసిన నేరమేమయ్యో శ్రీ ఆంజనేయ
లంకలోకి దూకి నీవు లంకిణిని హతమార్చినావు
లంకిణి హతమార్చినావు
మాత సీతను గాంచినావయ్యో శ్రీ ఆంజనేయ
నేను చేసిన నేరమేమయ్యో శ్రీ ఆంజనేయ
వందనాలు వందనాలయ్యో శ్రీ ఆంజనేయ
ఎన్ని వందనములు చేసిన ఉలకవు నను పలకరిచవు
నేను చేసిన నేరమేమయ్యో శ్రీ ఆంజనేయ
నేను చేసిన నేరమేమయ్యో అభయాంజనేయ
Tags
