231. రావా అయ్యప్ప రావా అయ్యప్ప | Rava Ayyappa Rava Ayyappa | అయ్యప్ప భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

231. రావా అయ్యప్ప రావా అయ్యప్ప | Rava Ayyappa Rava Ayyappa | అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
రావా అయ్యప్ప రావా అయ్యప్ప
రతనాల మేడదిగి రావా అయ్యప్ప
రావా అయ్యప్ప రావా అయ్యప్ప
రతనాల మేడదిగి రావా అయ్యప్ప
శరణమయ్యప్ప రావా అయ్యప్ప.. శరణమయ్యప్ప రావా అయ్యప్ప..

తేనాభిషేకం అంటే నీకెంతో ఇష్టమయ్యా
నెయ్యభిషేకం అంటే మరి మరి ఇష్టమయ్యా
గంధాభిషేకం అంటే నీకెంతో ఇష్టమయ్యా
విభూదాభిషేకం అంటే మరి మరి ఇష్టమయ్యా
||రావా అయ్యప్ప శరణమయ్యప్ప||
పాలాభిషేకం అంటే నీకెంతో ఇష్టమయ్యా
పూలాభిషేకం అంటే మరి మరి ఇష్టమయ్యా
పంచామృతాభిషేకం నీకెంతో ఇష్టమయ్యా
పన్నీరాభిషేకం అంటే మరి మరి ఇష్టమయ్యా
||రావా అయ్యప్ప శరణమయ్యప్ప||
పడి పూజలంటేను నీకెంతో ఇష్టమయ్యా
కలశ పూజలంటేను మరి ఇష్టమయ్యా
భజనలెన్నో చేస్తేనే నీకెంతో ఇష్టమయ్యా
నీ నామ కీర్తన అంటే మరి మరి ఇష్టమయ్యా
||రావా అయ్యప్ప శరణమయ్యప్ప||
కన్యస్వాములంటేను నీకెంతో ఇష్టమయ్యా
గురుస్వాములంటేను మరి ఇష్టమయ్యా
పాదయాత్ర చేస్తేనే నీకెంతో ఇష్టమయ్యా
పెద్ద పాదం చేసామంటే మరి మరి ఇష్టమయ్యా
||రావా అయ్యప్ప శరణమయ్యప్ప||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow