85. అడ్డబొట్టు పెట్టుకున్న అపరమేశ్వరుడు | Adda Bottu pettukunna | శివ భజన పాటల లీరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

85. అడ్డబొట్టు పెట్టుకున్న అపరమేశ్వరుడు | Adda Bottu pettukunna | శివ భజన పాటల లీరిక్స్

P Madhav Kumar

అడ్డబొట్టు పెట్టుకున్న అపరమేశ్వరుడు
నీలకంఠుడు శివుడు నిర్మలాత్ముడు
శంభో శంకర హరహర మహాదేవ
నిన్ను నమ్మిన భక్తుల బ్రోవరా దేవ
**॥ అడ్డబొట్టు ॥**
తలపైన గంగమ్మ తళతళలాడగా
మెడలోని పాములే బుసబుసలాడగా
నంది వాహనమెక్కి నువ్వు రావయ్యా
నీ పాద సేవ మాకు భాగ్యమయ్యా
**॥ అడ్డబొట్టు ॥**
డమరుకము చేతపట్టి నాట్యమాడగా
గజ్జెల సవ్వడితో లోకాలు మురవగా
కైలాస వాసుడా కరుణించ రావయ్యా
భక్త జనుల కష్టాలు తీర్చవయ్యా
**॥ అడ్డబొట్టు ॥**
అర్ధనారీశ్వరుడు అవతారమూర్తివి
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడివి
నిత్యము నిన్నే తలచి కొలుస్తాము శివయ్య
నిరతము మా తోడ నీవుండవయ్యా
**॥ అడ్డబొట్టు ॥**
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow