Sri Brahma Kavacham (Rudra Krutam) – శ్రీ బ్రహ్మ కవచం (రుద్ర కృతం)
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

Sri Brahma Kavacham (Rudra Krutam) – శ్రీ బ్రహ్మ కవచం (రుద్ర కృతం)

Madhav
నమః కమలపత్రాక్ష నమస్తే పద్మజన్మనే |
నమః సురాసురగురో కారిణే పరమాత్మనే || ౧ ||

నమస్తే సర్వదేవేశ నమో వై మోహనాశన |
విష్ణోర్నాభిస్థితవతే కమలాసనజన్మనే || ౨ ||

నమో విద్రుమరక్తాంగపాణిపల్లవశోభినే |
శరణం త్వాం ప్రపన్నోస్మి త్రాహి మాం భవసంసృతేః || ౩ ||

పూర్వం నీలాంబుదాకారం కుడ్మలం తే పితామహ |
దృష్ట్వా రక్తముఖం భూయః పత్రకేసరసంయుతమ్ || ౪ ||

పద్మం చానేకపత్రాంతమసంఖ్యాతం నిరంజనమ్ |
తత్ర స్థితేన త్వయైషా సృష్టిశ్చైవ ప్రవర్తితా || ౫ ||

త్వాం ముక్త్వా నాన్యతస్త్రాణం జగద్వంద్య నమోఽస్తు తే |
సావిత్రీశాపదగ్ధోహం లింగం మే పతితం క్షితౌ || ౬ ||

ఇదానీం కురు మే శాంతిం త్రాహి మాం సహ భార్యయా |
బ్రహ్మా వై పాతు మే పాదౌ జంఘే వై కమలాసనః || ౭ ||

విరించో మే కటిం పాతు సృష్టికృద్గుహ్యమేవ చ |
నాభిం పద్మనిభః పాతు జఠరం చతురాననః || ౮ ||

ఉరస్తు విశ్వసృక్ పాతు హృదయం పాతు పద్మజః |
సావిత్రీపతిర్మే కంఠం హృషీకేశో ముఖం మమ || ౯ ||

పద్మవర్ణశ్చ నయనే పరమాత్మా శిరో మమ |
ఏవం న్యస్య గురోర్నామ శంకరో నామశంకరః |
నమస్తే భగవన్ బ్రహ్మన్నిత్యుక్త్వా విరరామ హ || ౧౦ ||

ఇతి శ్రీపద్మమహాపురాణే సృష్టిఖండే చతుస్త్రింశత్తమోఽధ్యాయే రుద్ర కృత శ్రీ బ్రహ్మ కవచమ్ ||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow