ఆకాశమంతటి అయ్యప్ప కొండను నేనెట్ట ఎక్కాలా.. స్వామి నిన్నెట్ట మొక్కాలా
సింగలెలే కోనంట చిరుతలు తిరిగే కొండంట
నేనెట్ట ఎక్కాలా.. స్వామి నిన్నెట్ట మొక్కాలా
పంబవాస పందళ రాజా.. మా వెంట నీవుంటే స్వామి ఈ కొండ ఎంతంట

అయ్యప్పో అయ్యప్పో స్వామి శరణం అయ్యప్ప
ఆకాశమంతటి అయ్యప్ప కొండను నేనెట్ట ఎక్కాలా.. స్వామి నిన్నెట్ట మొక్కాలా
భూలోకనాథ నీలాద్రివాస.. మా అండ నీవుంటే స్వామి ఈ కొండ ఎంతంట

రావో రావయ్యో అయ్యప్ప స్వామి.. హరి పూజకు రావయ్యో మణికంఠ స్వామి
ఆకాశమంతటి అయ్యప్ప కొండను నేనెట్ట ఎక్కాలా.. స్వామి నిన్నెట్ట మొక్కాలా
శివుని కుమారా శ్రీ విష్ణు పుత్ర.. ఏ పూజ చేయాలా పూజకు ఏ పూలు తేవాలా
శబరివాసుడా శంకర పుత్ర.. ఏ పేర పిలవాలా నిన్ను ఏమని మొక్కాలా
అయ్యప్పో అయ్యప్పో స్వామి శరణం అయ్యప్ప
రావో రావయ్యో అయ్యప్ప స్వామి.. హరి పూజకు రావయ్యో మణికంఠ స్వామి
స్వామి శరణం శరణం అయ్యప్ప
పిల్లాలి వీరుడే వీరమణి కంఠుడే
శరణం శరణం అయ్యప్ప.