234. అయ్యప్ప స్వామి రావయ్యా ఓ హరిహర తనయ | Ayyappa Swamy ravaiah | అయ్యప్ప భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

234. అయ్యప్ప స్వామి రావయ్యా ఓ హరిహర తనయ | Ayyappa Swamy ravaiah | అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
అయ్యప్ప స్వామి రావయ్యా ఓ హరిహర తనయ అయ్యప్ప స్వామి రావయ్యా
అయ్యప్ప స్వామి రావయ్యా ఓ రావయ్యా అయ్యప్ప స్వామి రావయ్యా
మణికంట స్వామి రావయ్యా మమ్మేలే తండ్రి మణికంట స్వామి రావయ్యా

శబరిగిరీశుడ షణ్ముఖ సోదర పందల రాజా అయ్యప్ప

శివమోహిని ముద్దుల తనయ మహిషి మర్దన అయ్యప్ప

అయ్యప్ప స్వామి రావయ్యా ఓ హరిహర తనయ్యా అయ్యప్ప స్వామి రావయ్యా
మణికంట స్వామి రావయ్యా మమ్మేలే తండ్రి మణికంట స్వామి రావయ్యా

నలభై దినములు నీ మాలేసి నిష్టగా నిన్ను పూజించి

నెత్తిన ఇరుముడి నెత్తుకొని నీ శబరిమలైగిరి చేరేము
నెత్తిన ఇరుముడి నెత్తుకొని నీ శబరిమలైగిరి చేరేము
అయ్యప్ప స్వామి రావయ్యా ఓ హరిహర తనయ్యా అయ్యప్ప స్వామి రావయ్యా
మణికంట స్వామి రావయ్యా మమ్మేలే తండ్రి మణికంట స్వామి రావయ్యా

మకర సంక్రాంతి రోజున స్వాములు జ్యోతి దర్శనం చేసుకొని

పద్దెనిమిది మెట్లను ఎక్కి అయ్యప్పని దర్శించేము
పద్దెనిమిది మెట్లను ఎక్కి అయ్యప్పని దర్శించేము
అయ్యప్ప స్వామి రావయ్యా ఓ హరిహర తనయ అయ్యప్ప స్వామి రావయ్యా
మణికంట స్వామి రావయ్యా మమ్మేలే తండ్రి మణికంట స్వామి రావయ్యా

పిలిచిన పలికే దేవుడవయ్యా శబరి గిరీశ అయ్యప్ప

నిత్యం కొలిచే భక్తుల మదిలో కొలువైనావు అయ్యప్ప
నిత్యం కొలిచే భక్తుల మదిలో కొలువైనావు అయ్యప్ప
అయ్యప్ప స్వామి రావయ్యా ఓ హరిహర తనయ్యా అయ్యప్ప స్వామి రావయ్యా
మణికంట స్వామి రావయ్యా మమ్మేలే తండ్రి మణికంట స్వామి రావయ్యా

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow