మంత్రము :- “ఓం అస్యశ్రీ శివలింగ ప్రాణ ప్రతిష్ఠాపన మంత్రస్య బ్రహ్మ - విష్ణు - రుద్ర - ఈశ్వర - సదాశివ - ఋషయః ఋగ్యజుస్సామాథర్వణ చందాంసి సకల జగత్సృష్టికారిణీ ప్రాణశక్తిః పరా దేవతా । ఆం బీజం హ్రీం శక్తిః క్రోం కీలకం అమృతలింగ మధ్యే మహాదేవ ప్రాణప్రతిష్ఠ సిద్ధ్యర్థం జపేవినియోగః ॥ అని జెప్పిన పిదప
మంత్రము :- “ఓం ఆం హ్రీం క్రోం ఆకాశవాయు వహ్ని సలిల పృథివ్యాత్మనే, అం, కం, ఖం, గం, ఘం, జం, ఆం హ్రీం క్రోం ఆం ఓం అంగుష్ఠాభ్యాం నమః । ఆం హ్రీం క్రోం శబ్ద, స్పర్శ, రూప, రస గంధాత్మనే ఇం చం ఛం జం ఝం ఇం ఆం హ్రీం క్రోం ఈం ఊం తర్జనీభ్యాం నమః । ఓం ఆం హ్రీం క్రోం త్వక్చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణాత్మనే ఓం టం ఠం డం ఢం ణం ఓం ఆం
కరన్యాసము & హృదయాదిన్యాసము (Karanyasamu & Hridayadinyasamu)
హ్రీం క్రోం ఓం మధ్యమాభ్యాం నమః । ఓం ఆం హ్రీం క్రోం వాక్పాణి పాదపాయూపస్థాత్మనే ఓం తం థం దం ధం నం ఓం ఊం ఆం హ్రీం క్రోం ఓం అనామికాభ్యాం నమః । ఓం ఆం హ్రీం క్రోం మనోబుద్ధ్యహంకారచిత్త విజ్ఞానాత్మనే నమః ఓం పం ఫం బం భం జం ఆం హ్రీం క్రోం కనిష్ఠికాభ్యాం నమః । ఓం ఆం హ్రీం క్రోం వచనాదానగమన విసర్జనానందాత్మనేనమః ఆం యం రం లం వం శం షం సం హం ళం క్షం ఆం హ్రీం క్రోం ఆం కరతల కర పృష్ఠాభ్యాం నమః ॥
అని కరన్యాసము జేసి, ఇదేవిధముగా హృదయాన్యాసమును జేయవలెను. ఎట్లనగా
మంత్రము :- “ఓం ఆం హ్రీం క్రోం...అం ఓం హృదయాయ నమః । ఆం హ్రీం...శబ్ద స్పర్శ...ఓం శిరసేస్వాహ । ఓం ఆం హ్రీం...హ్రీం క్రోం ఓం శిఖాయై వషట్ । ఓం ఆం...వాక్పా...క్రోం ఓం కవచాయహుం । ఓం ఆం...మనో...హ్రీం క్రోం నేత్రత్రయాయవౌ షట్ । ఓం ఆం వచనాదాన...క్రోం ఆం అస్త్రాయఫట్ । ఓం భూర్భువస్వరోమితి దిగ్బంధః ॥
(హృదయాన్యాసము జేయునపుడు కరన్యాసములో చెప్పిన మంత్రములనే చెప్పి చివరిలో మాత్రము పైన జెప్పబడిన విధముగా “శిరసేస్వాహ” శిఖాయై వషట్ అను వాక్యములను చెప్పవలెను. దానికొరకు వైదిక గ్రంథములలో కరన్యాసమును మాత్రమే వ్రాసి “ఏవం హృదయాదిన్యాసః” అని వ్రాసి వదలేతురు) తదుపరి ధ్యానము.
ధ్యానము & ప్రాణ ప్రతిష్ఠ (Dhyanamu & Prana Pratishta)
మంత్రము :- “రక్తాంభోధిస్థపోతొల్ల సదరుణ సరోజాధిరూఢా కరాబ్జైః పాశం కోదండమిక్షూద్భవమలిగుణమప్యంకుశం పంచబాణాన్ ॥ బిభ్రాణాసృక్కపాలం త్రినయన విలసత్పీనవక్షోరుహాడ్యాదేవీ బాలార్కవర్ణా భవతు సుఖకరీ ప్రాణః శక్తిః పరానః ॥
అని బాగుగా ధ్యానించి, ఉతికిన క్రొత్త వస్త్రమును ముసుగువేసికొని మంత్రము :- “ఓం అముష్యప్రాణ ఇహప్రాణః సోహం సోహం” ఇట్లుచ్చరించి పాదమునుండి నాభివరకు బ్రహ్మ భాగమునందును.
మంత్రము :- “ఓం అముష్యజీవ ఇహస్థితః సోహం సోహం” ఇట్లుచ్చరించి నాభి నుండి హృదయపర్యంతము విష్ణు భాగములోను.
మంత్రము :- “ఓం అముష్య సర్వేంద్రియాణి వాఙ్మనశ్చక్షుః శ్రోత్ర జిహ్వాఘ్రాణ ఇహైవాగత్య సుఖంచీరంతస్థం తంతు స్వాహా ॥
ఇట్లుచ్చరించి హృదయము నుండి మస్తకము వరకు రుద్ర భాగములోను న్యాస (స్పర్శ)ము జేయాలి. ఆ మీదట :-
మంత్రము :- “ఓం ఆం హ్రీం క్రోం అముష్యప్రాణ ఇహప్రాణః సోహం సోహం । ఓం ఆం హ్రీం క్రోం అముష్యజీవ ఇహస్థితః సోహం సోహం । ఓం ఆం హ్రీం క్రోం ఓం అముష్య సర్వేం ద్రియాణి సోహం సోహం। ఓం ఆం హ్రీం క్రోం వాఙ్మనశ్చక్షుః శ్రోత్రజిహ్వ ఘ్రాణ ప్రాణోపాన వ్యానోదాన సమాన నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయాది దశప్రాణా ఇహాగత్యాగత్య ఆగచ్ఛాగచ్ఛ ఆకర్షయాకర్షయ । సుఖం చిరం తిష్ఠంతు స్వాహా ॥
ప్రతిష్ఠాపన విధి (Pratishtapana Vidhi)
ఆం హ్రీం క్రోం టం ఠం డం ఢం ణం ఓం వాక్పాణి పాద పాయూపస్థాత్మనే । ఓం ఆం హ్రీం క్రోం ఇం తం థం దం ధం నం త్వక్చక్షుః శ్రోత్ర జిహ్వా ఘ్రాణాత్మనే । ఓం ఆం హ్రీం క్రోం ఓం పం ఫం బం భం మం జం మనోబుద్ధ్యహంకార చిత్త విద్యానాత్మనే । ఓం ఆం హ్రీం క్రోం యం రం లం వం శం షం సం హం ళం క్షం వచనాదాన గమన విసర్జనా నందాత్మనే । అముష్య ప్రాణా ఇహప్రాణా అముష్యజీవ ఇహస్థితః అముష్య సర్వేంద్రియాణికాయ వాఙ్మనశ్చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణ వాక్పాణి పాదపాయూపస్థ త్వక్ మేదోస్థి మజ్జా శుక్ల మనోబుద్ధ్యహంకార చిత్తాని ఇహామృతలింగమధ్యే సమావిశ్య సుఖంచీరం తిష్ఠంతుస్వాహా ॥
ఈ మంత్రమును ఉచ్చరించి ప్రాణేంద్రియములను ప్రతిష్ఠా పనమొనర్చి
మంత్రము :- “అసునీతేపునరస్మా సుచక్షుః పునః ప్రాణమిహనో దేహిభోగం । జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరంత మనుమతే మృడయాన స్వస్తి ॥
ఆం క్రీం హ్రోం ఓం । మహా పద్మవనాతస్థకారణానంద విగ్రహా । సర్వభూత హితేమాతే ఏహ్యేహి పరమేశ్వరి । ఓం ఆం హ్రీం క్రోం । ఆవాహితోభవ ఆసీనోభవ । అవకుంఠితోభవ । ప్రసీదోభవ। సుప్రసన్నోభవ । అస్మిన్ అమృతలింగమూర్తి మధ్యే మహాదేవం ప్రసన్నం కురు కురు స్వాహా ॥ హంస్లాం హంస్లీం హంస్లూం హంస్లైం హంస్లౌం హంస్లః ॥ ఆగచ్ఛాదిత్య మధ్యస్థ పార్వతీ సహిత ప్రభో । అస్మిన్ బింబే ప్రతిదినం సన్నిధిర్భవ శంకర ॥
అని ప్రార్థించి అర్ఘ్యపాద్యాచమనములను సమర్పించి, ముసుగువై చిన వస్త్రమును దీసి పంచ బ్రహ్మాన్యాసము నాచరించవలెను. ఎటులనగా :-
పంచబ్రహ్మ న్యాసము & అభిషేకము (Panchabrahma Nyasamu)
మంత్రము :- “ఓం హ్రీం నం సద్యోజాతాయనమః” అని యుచ్చరించి పాదములందును,
మంత్రము :- “ఓం హ్రీం మం వామదేవాయ నమః” అని గుహ్య స్థానమందును,
మంత్రము :- “ఓం హ్రీం శిం అఘోరాయ నమః” అని హృదయమందును,
మంత్రము :- “ఓం హ్రైం వాం తత్పురుషాయ నమః” అని ముఖమునందును,
మంత్రము :- “ఓం హ్రౌం యం ఈశానాయనమః” అని శిరస్సునందు పంచబ్రహ్మాన్యాసము నొనర్చి పిదప
మంత్రము :- “ఓం సాంబ సదాశివాయనమః” అని నా మమంత్రముచేత పంచోపచార (సమయావకాశ ముండిన యెడల షోడశోపచార)ములతో బూజించి
మంత్రము :- “ఓం నిధనపతయే నమః” అని ఇష్ట లింగమును దీసికొని వామహస్తమున నిడుకొని మొదలు బూజించిన కలశోదకముతో రుద్రసూక్తమును అథవా పురుష సూక్తముతో నభిషేకించవలెను. పిదప గురు పాదోదకముచేత నభిషేకించునది.
మంత్రము :- “చరణం పవిత్రం పురాణం యేన పూతస్త రతిదుష్కృ తాని । తేన పవిత్రేణ శుద్ధేన పూతాః । అతి పాప్మాన మరాతింతరేమ” అని యభిషేకించి, పిదప షోడశోపచారములతో యజించి
జాతకర్మ - లింగధారణ విధి (Jatakarma - Lingadharana Vidhi)
మంత్రము :- “యస్యస్మృత్యాచనమోక్త్యా తపః పూజాక్రియాదిషు । న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే సదాశివం ॥
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర । యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుమే ॥ అనయాధ్యానాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మక శ్రీ సాంబసదాశివ సుప్రీత సుప్రసన్నో వరదోభవతు ॥
అని యుచ్చరించి అక్షంతలతో గూడిన హిరణ్యోదకమును వదల వలెను. తరువాత :
మంత్రము :- “అంగాదంగాత్సమ్భవసి, హృదయాదధిజాయసే । ఆత్మావై పుత్రనామాసి సజీవశరదశ్శతం ॥
అని యుచ్చరించి శిశువుయొక్క కుడిప్రక్క చెవిలో బంగారమును (స్వర్ణము) ముట్టించి ఆ మంత్రముతోనే శిశువు ఎడమచెవిలోను ముట్టించవలెను.
మంత్రము :- “అశ్మాభవ పరశుర్భవ హిరణ్యమస్తృతమ్భవ । పశూనాంత్వా హికారేణాభిజిఘ్రామి ॥
అని పఠించి శిశువుయొక్క రెండు భుజములపై బంగారముతో (స్వర్ణము) ముట్టించవలెను. ఆ పిదప గురువుగారు :
మంత్రము :- “ఓం భూర్భువఃస్వః । తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి । ధియోయోనః ప్రచోదయాత్” ॥
గాయత్రీ మంత్రము & శిశు సంరక్షణ (Gayatri & Child Rites)
అను గాయత్రీ మంత్రముతో శిశువుపై కలశోదకమును మూఁడు సార్లు ప్రోక్షించి,
మంత్రము :- “త్ర్యంబకం యజామహే, సుగంధిం పుష్టివర్ధనం । ఉర్వారుకమివబంధనాత్ మృత్యోర్ముక్షీయమాఽమృతాత్”
అను మంత్రముచేత భస్మమును ధరించి శిశువు కంఠమున (రేష్మి వస్త్రమునందు లింగమును బంధించి)
మంత్రము :- “యజ్ఞోపవీతం పరమం పవిత్రం, ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ । ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచశుభ్రం, యజ్ఞోపవీతం బలమస్తు తేజః ॥”
అని యుచ్చరించి లింగమును ధరింపఁజేసి, శిశువు యొక్క కుడి చెవిలో మహా మంత్రము నుపదేశించి పాదోదకము నొసంగవలెను.
తదుపరి శిశువు తండ్రి ఒక కంచుపాత్రలో నెయ్యి, తేనె వైచి (తల్లి తొడపై పూర్వదిక్కునకు ముఖము జేసిన శిశువునకు) శిశువు యొక్క మస్తకమును ఆఘ్రాణించి
మంత్రము :- మేధాంతే దేవస్సవితా మేధాం దేవీసరస్వతీ । మేధాంతే అశ్వినౌ దేవా వాధత్తాం పుష్కరస్రజాత్వయై మేధాం త్వయి ప్రజాత్యయ్యగ్నిస్తేజోధా ధాతు । త్వయి మేధాం త్వయి ప్రజాం త్వయి సూర్యోభ్రాజోధా ధాతు ॥
ఈ మంత్రము నుచ్చరించి, శిశువు యొక్క నోటిలో నెయ్యి, తేనెలను కొద్దిగావేసి
మంత్రము :- (ససిరాజాతవేదాః అక్షరం పరమం పదం । దేవా నాగంశిర ఉత్తమంజాతవేదసెశిరసి మాతవే బ్రహ్మ భూర్భువస్సు వరోం) అని చెప్పి తల్లి యొక్క కుడి స్తనముపై దర్భతో ప్రోక్షించి
మంత్రము :- “(అయంకుమారోజరాంధయత్ । దీర్ఘమాయుః యస్మైత్వగ్ం స్తనప్రప్యాయాయుర్వచ్యో యశో బలం)”
అను మంత్రమును జెప్పి శిశువునకు మొదలు కుడి కుచము యొక్క పాలు గుడిపించవలెను. ఇకముందు వృద్ధాచారాను సారముగా నాచరించ వలెను. ఆ దినమునందు యధాశక్తి భక్తా-మాహేశ్వరులకు భోజన దక్షిణాదులను సమర్పించి సంతృప్తి జేయవలెను.
॥ ఇది జాతకర్మ యొక్క లింగధారణ విధిః ॥
