Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

38. గండాంత శాంతి | Gundantha shanthi

P Madhav Kumar

 గోముఖ ప్రసవమును జేసి, దేశకాలాదులనుచ్చరించి


మంత్రము :- 
“అస్యశిశో రేవత్యశ్వీన్యా శ్లేషా మఘా సంధ్యాత్మక నక్షత్ర గండాంత జననసూచితారిష్ట నిరసనార్థం నక్షత్ర గండాంత శాంతిం కరిష్యే ॥

అని సంకల్పించి, గణపతి పూజ స్వస్తి పుణ్యాహవాచన, నాందీముఖాదులనాచరించి, ఆచార్యునివరించి, వారికి తెల్లని రేష్మి వస్త్రమును సమర్పించి పుష్పమాలను సమర్పించవలెను. తరువాత ఆచార్యుడు తెల్ల ఆవాలును మంత్ర పురస్సరముగా వెరచి (వేసి) భూశుద్ధి గావించి, ఒక కంచు పాత్రను దీసికొని దానిలో పాయసమునుగాని, పాలనుగాని పోసి (ఉంచి) దానిని వెన్నతో నింపిన శంఖమును తూర్పు దిశలో ఉంచి, దాని ముఖమున వెండితో జేయబడిన చంద్రుని ప్రతిమను ఉంచి

మంత్రము :- 
ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వతస్సోమ వృష్ణ్యియం, భవావాజస్యసంగథే “ఓం భూర్భువః స్వఃసోమ ఇహాగచ్చ ఇహతిష్ఠ ” అని యుచ్చరించి ఆవాహించి

“ఓం సోమాయనమః” అనే మంత్రముచేత షోడశోపచారములతో పూజించి తెల్లని వేయి పుష్పములతో పుష్పాంజలిసర్పించవలెను. పూజాంతమున

మంత్రము :- 
ఓం ఆప్యాయ……సంగథే ॥

అను మంత్రముచేత సహస్రావర్తి (వేయిమార్లు) పూజించవలెను. పిదప దానికి ఉత్తర దిశ యందు రాగి పాత్రలో బంగారుతో నిర్మించిన బృహస్పతి ప్రతిమను ఉంచి

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow