Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

37. మఘరేవత్యాది నక్షత్ర గండాంత శాంతి ప్రయోగము | Nakshatra Gandanta Shanti Ritual Procedures

P Madhav Kumar
మఘరేవత్యాది నక్షత్ర గండాంత శాంతి ప్రయోగము

రేవతి, ఆశ్లేష, జ్యేష్ఠ, ఈ నక్షత్రముల చివర రెండు ఘటికా, అశ్వీని, మఘా, మూలా, ఈ నక్షత్రముల మొదట రెండు ఘటికా ; మొత్తం నాలుగు ఘటికలు త్రివిధ నక్షత్ర గండాంతము. ఇందు జననమైనచో నక్షత్ర గండాంత శాంతిని యనుష్టించవలెను. మఘా నక్షత్రము యొక్క ప్రధమ చరణమున జన్మించిన మూలానక్షత్రము వలెనే ఫలమును తెలియవలెను. (గ్రహించదగును) ఇందు కు గోప్రసవము, నక్షత్రాధిపతి పూజను, గ్రహ హోమాదులను జేయవలెను. రేవతి, అశ్వినీ, నక్షత్రముల ఇతర చరణముల యందు జన్మించిన యెడల విశేష దోషము గలుగవు కనుక శాంతి నాచరించవలదు, ఐనను గణారాధనను ఆచరించవలెను.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow