అథ ప్రాణ ప్రతిష్ఠః
మంత్రము :- “అస్యశ్రీ ప్రాణప్రతిష్ఠా మంత్రస్య బ్రహ్మ-విష్ణు-రుద్రా ఋషయః ఋగ్యజుః సామానిచ్ఛందాంసిప్రాణశక్తిః దేవతా ఆం బీజం హ్రీం శక్తిః క్రోం కీలకం ప్రాణస్థాపనే వినియోగః । జం కం ఖం ఘం గం నభోవాయ్వగ్ని జల భూమ్యాత్మనే హృదయాయ నమః । ఇం చం ఛం ఝం జం శబ్ద స్పర్శ రూప రస గంధాత్మనే శిరసేస్వాహా। ణం టం ఠం ఢం డం శ్రోత్ర వాక్చయన జిహ్వా ఘ్రాణాత్మనే శిఖాయై వషట్ । నం తం థం ధం దం వాక్పాణి పాద పాయూప స్థాత్మనే కవచాయహుం । మం పం ఫం భం బం వక్త్రవ్యాదాన గమన విసర్గా నందాత్మనే నేత్రత్రయాయవౌషట్ । శం యం రం వం లం హం షం క్షం సం బుద్ధిమనోహంకార చిత్తాత్మనే అస్త్రాయఫట్ ॥
ఇట్లున్యాసమొనర్చి, అనంతరము నాభి నుండి పాదము వరకు (ఆం నమః) అనియు, హృదయమునుండి నాభి వరకు (హ్రీం నమః) అనియు ముఖము నుండి హృదయము వరకు (క్రోం నమః) అనియు న్యాస మొనర్పవలెను. (యం త్వగాత్మనే నమః) అని వాయువ్య మూల యందును (రం రక్తాత్మనే నమః) అని ఆగ్నేయ దిశయందు (మూల యందు)ను (లం మాంసాత్మనే నమః) అని తూర్పు దిక్కు నందును, (వం మేధాత్మనే నమః) అని పశ్చిమ దిశయందును, (శం అస్థ్యాత్మనేనమః) అని నైరుత్య మూలయందును, (సం శుక్రాత్మనే నమః) అని ఉత్తర దిక్కులోను (హం ప్రాణాత్మనే నమః) అని మధ్యభాగముందును,
(ఈ విధముగా హృదయ కమలమునందును) న్యాసమొనర్పవలెను. తదుపరి ధ్యానము “రక్తాంభోధిస్థ...ప్రాణశక్తిః పరానః” అని చెప్పి ప్రాణప్రతిష్ఠ జేయవలెను.
ఇది ప్రాణ ప్రతిష్ఠః
మంత్రము :- “అస్యశ్రీ మహా మృత్యుంజయ మంత్రస్య వశిష్ఠ ఋషిః అనుష్టుప్ఛందః శ్రీ త్ర్యంబకరుద్రోదేవతా శ్రీబీజం హ్రీం శక్తిః మమ అభీష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః” (ఇక్కడ ప్రత్యేకముగా ప్రయోగమునందు మొదట సంకల్పమును జెప్పి పునః వినియోగః, అని చెప్పవలెను, ఆ మీదట న్యాసము ధ్యానాదులను ఆచరించవలెను,) అని వినియోగముజేసిన తరువాత
“ఓం వశిష్ఠ ఋషయేనమః” అని శిరస్సునందును, “అనుష్టుప్ ఛందసేనమః” అని ముఖమునందును, “శ్రీత్ర్యంబకరుద్రో దేవతాయై నమః” అని హృదయమున “శ్రీం బీజాయనమః” అని గుహ్యస్థానమునను “హ్రీం శక్తయేనమః” అని పాదములందును ఋష్యాదిన్యాసమును జేయవలెను. ఆ పిదప కరన్యాసమును జేయవలెను.
“ఓం హ్రాం ఓం జుం సః భూర్భువఃస్వః త్ర్యంబకం ఓం నమో భగవతే రుద్రాయ శూల పాణయే స్వాహ-అంగుష్ఠాభ్యాం నమః ।
ఓం హ్రీం ఓం జుం సః భూర్భువఃస్వః యజామహే ఓం నమో భగవతే రుద్రాయ శూల పాణయే స్వాహ-అంగుష్ఠాభ్యాం నమః ।
ఓం హ్రూం ఓం జుం సం భూర్భువఃస్వః యజామహే ఓం నమో భగవతే రుద్రాయ అమృత మూర్తయే మాంజీవయ-తర్జనీభ్యాం నమః ।
ఓం హ్రైం ఓం జుం సః భూర్భువఃస్వః సుగంధిం పుష్టివర్ధనం ఓం నమో భగవతే రుద్రాయ చంద్ర శిరసే జటినేస్వాహ-మధ్య మాభ్యాం వషట్ ।
ఓం హ్రౌం ఓం జుం సః భూర్భువఃస్వః ఉర్వారుకమివ బంధనాత్ ఓం నమో భగవతే రుద్రాయ
త్రిపురాంతకాయ హ్రోం హ్రీం-అనామికాభ్యాం హుం । ఓం హ్రాం ఓం జుంసః భూర్భువఃస్వః మృత్యోర్ముక్షీయ ఓం నమో భగవతే రుద్రాయ త్రిలోచనాయ ఋగ్యజుః సామమంత్రాయ - కనిష్ఠికాభ్యాం వౌషట్ । ఓం హ్రాం ఓం జుంసః భూర్భువఃస్వః మామృతాత్ ఓం నమో భగవతే రుద్రాయ అగ్నిత్రయాయ జ్వలజ్వలమాం రక్షరక్ష అఘోరాస్త్రాయ-కరతల కర పృష్ఠాభ్యాం ఫట్” అని కరన్యాసమును జేయునది.
ఇదే మేరకు హృదయాదిన్యాసమును జేయవలెను, పిదప అక్షరన్యాస క్రమము- “త్ర్యం నమః” అని కుడిపాదము చివరలో
(ఓం నమః కం నమః యం నమః జుం నమః) అని కుడి పాదము యొక్క నాలుగు సంధుల యందును (మం నమః) అని యెడమ పాదము చివరలోను (హ్రీం నమః సుం నమః గం నమః ధిం నమః) అని యెడమ పాదముయొక్క నాలుగు సంధులలోను, (పుం నమః) అనిగుహ్యస్థానమున (ష్టిం నమః) అని గుదస్థానమున, (వం నమః) అని ఉదరము (కడుపు) లోను (ర్థం నమః) అని హృదయమున (నం నమః) అని కంఠము నందు, (ఉం నమః) అని కుడిచేయి చివరను (వాం నమః రుం నమః కం నమః మిం నమః) అని కుడిచేతి నాలుగు సంధులయందును [వం నమః] అని యెడమ చేయి చివరకు [ఓం నమః ధం నమః నాం నమః స్మృం నమః] అని యెడమ చేయి నాలుగు సంధులందును, (త్ర్యోం నమః) అని ముఖమునందును, (ముం నమః) అని పెదవులలో (షీం నమః) అని నాసిక (ముక్కు) న (యం నమః) అని నేత్రములందును (మం నమః) చెవుల యందు (మృం నమః) అని కనుబొమ్మలపైను, (తాం నమః) అని తలపై అక్షరన్యాస మొనర్పవలెను. ఇక పదన్యాసక్రమము
[త్ర్యంబకం అని] శిరస్సుపై (యజామహే) అని కనుబొమ్మలపైను (సుగంధిం) అని నేత్రములపై (పుష్టివర్ధనం) అని ముఖమున (ఉర్వారుకం) అని కంఠమునందును, (మివ) అని హృదయమున (బంధనాత్) ఉదరమున (మృత్యోః) గుహ్యమునందు (ముక్షీయ) అని తొడలయందు, (మా) మొ[ణ]కాలుపై (అమృతాత్) అని పాదములయందును పదన్యాసమును జేయవలెను. తదుపరి ధ్యానము
మంత్రము :-
“హస్తాభ్యాంకలశద్వయామృత రసైరాప్ల వయంతం శిరోద్వాభ్యాంతౌ దధతం మృగక్ష వలయే ద్వాభ్యాం వహంతం పరం అంకన్యస్తకర ద్వయామృత ఘటం కైలాస కాంతంశివం స్వచ్ఛాం భోజగతం నవేందుమకుటాభాతం త్రినేత్రం భజే ॥1॥ “మృత్యుం జయ మహదేవా ! త్రాహిమాం శరణాగతం । జన్మమృత్యుజరారోగై పీడితం కర్మ బంధనైః ॥2॥ తవ కన్యద్గత ప్రాణ స్త్వచ్చిత్తో హంసదామృడ । ఇతి విజ్ఞాప్యదేవేశం జపేన్మృత్యుంజయం మనుం ॥3॥ అని ధ్యానించి తదుపరి మూలమంత్రము :-
మంత్రము :-
“ఓం హ్రాం ఓం జుం సః భూర్భువఃస్వః త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం । ఉర్వారుకమివబంధనాన్మృత్యోర్ముక్షీయమామృతాత్ । భూర్భువః స్వరోంజుంసః హ్రాం ఓం” ॥1॥
ఈ విధముగా మంత్రము రుద్రాక్షమల ద్వారా (రుద్రాక్ష మాలతో) గాని లేదా మధ్యమ మరియు అంగుష్ఠ (వ్రేళ్ళ) మధ్యనున్న పర్వముతో గాని (మణులను) గుంజుతూ [లాగుతూ] ఏకాగ్రచిత్తుడై జపించ వలయును. జపమును జేసిన పిదప పూర్వోక్తప్రకారము అంగన్యాసము వాచరించి ముగించవలెను. ఆ తదుపరి :-
మంత్రము :-
“గుహ్యాతి గుహ్య గోప్తృత్వం గృహాణాస్మత్కృతం జపం । సిద్ధిర్భవతుమే దేవ త్వత్ప్ర సాదాన్మహేశ్వరః ॥
అని యుచ్చరించి తరువాత యథాశక్తి మాహేశ్వరులను భోజన దక్షిణాడులతో తృప్తి పరచవలెను.
(ఇది మహామృత్యుంజయ జప శాంతి విధి పరిసమాప్తము)