19. కొండగట్టులో వెలసిన అంజన్న నీ అండ దండ | Kondagattulo velisina Anjanna | హనుమాన్ భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

19. కొండగట్టులో వెలసిన అంజన్న నీ అండ దండ | Kondagattulo velisina Anjanna | హనుమాన్ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
కొండగట్టులో వెలసిన అంజన్న నీ అండ దండ
మాకుండాలని కొబ్బరికాయలు, పూలు, పండ్లు
ఫలహారాలు నీకు తెస్తిమయ్య

కోరస్:
అంజన్నా… అంజన్నా… మమ్ము కాపాడరావయ్య

తడి బట్టలతో స్నానం చేసి
వడివడిగా నీ గుడిలోకొచ్చి
రామ మంత్రమే జపియించేము
రామదూతయని పూజించేము

కలకలలాడే ఓ అంజన్న కరుణతో
మమ్ము కాపాడరావయ్య
||కొండగట్టులో వెలసిన||
నీ మందేమో కోటి కోతులు
నీ సుట్టమో కోటి భక్తులు
జిగేలుమన్న జిల్లేడు దండలు
పవిత్రమైన పత్రి రాకులు

గణగణ నీ గుడి గంటలు కొట్టి
గణముగా పూజలు చేసేము అంజన్న
||కొండగట్టులో వెలసిన||
మెండైన నీ కొండను ఎక్కి
దండిగా పూజలు చేసేమయ్య
నిన్ను తలవని కాయమెందుకు
నిన్ను కొలువని కరములేందుకు

బహు బలవంత బ్రహ్మ స్వరూప
బాధలు బాపగా వేగమే రావయ్య
||కొండగట్టులో వెలసిన||
కొండగట్టు పై వెలసితివయ్య
దండి రాక్షసుల గుల్చితివయ్య
నిగుడియందు గండ దీపము
నీ గుడి ముందు గరుడ స్థంభము

వేగ వేగ నీ కొండకు వచ్చి
వేడుకలెన్నో చేసేము అంజన్న
||కొండగట్టులో వెలసిన||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow