చీర్యాల వాసా రావా చింతలు తీర్చే నినువేడ
చీర్యాల నరసింహరావా చింతలు తీర్చే నినువేగా
నుదుటన తెల్లని నామం ఇరువైపుల శంఖ చక్రం
కొలిచిన వారికి స్వామి నీదే కొంగు బంగారం
మా లక్ష్మీ వరదా రావా రావయ్యా మమ్ముల బ్రోవా
చుట్టూ చూడు పచ్చదనం ఆకాశమే నీకు గోపురం
చూసిన చాలు నీ రూపం కలుగును మాకెంతో భాగ్యం
లక్ష్మీ వరదా రావా రావయ్యా మమ్ముల బ్రోవా
విడిచినావా వైకుంఠం చేరినావా ఈ క్షేత్రం
వైకుంఠమైనా విడిచివు గానీ భక్తుల విడిచి ఉండవు
మా లక్ష్మీ వరదా రావా రావయ్యా మమ్ముల బ్రోవా
శ్రీ లక్ష్మీదేవితో నీవు సిరులు చిందేలా వెలిసావు
నిను కొలవంగా మాకు సిరి సంపద కురిపించావు
లక్ష్మీ వరదా రావా రావయ్యా మమ్ముల బ్రోవా
చీర్యాల నరసింహరావా చింతలు తీర్చే నినువేగా
