236. నా గుండెనే నీ ఆలయం నా మనసే నీ గోపురం | Naa Gunde nee Aalayam na manase | అయ్యప్ప భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

236. నా గుండెనే నీ ఆలయం నా మనసే నీ గోపురం | Naa Gunde nee Aalayam na manase | అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
నా గుండెనే నీ ఆలయం నా మనసే నీ గోపురం
నా గుండెనే నీ ఆలయం నా మనసే నీ గోపురం
నా చిత్తమే నీకు వత్తులు చేసి వెలిగించిన దీపం అయ్యప్పా
నువ్వే నా గానమయ్యా స్వామి నువ్వే నా ప్రాణమయ్యా

నా గుండెనే నీ ఆలయం నా మనసే నీ గోపురం
స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
స్వామి శరణమయ్యప్ప శరణం శరణం శరణం అయ్యప్ప

ఉదయాన సూర్యుడు పొడిచినప్పుడు నువ్వే వచ్చినట్టు అనిపించేనయ్యా
కారు మేఘాలన్నీ కమ్ముకున్నప్పుడు నీలాల నీ కురులే మెరిసేనయ్యా
పూలన్ని తోటల పులకించినప్పుడు నువ్వే నవ్వినట్టు అనిపించేనయ్యా
ఆకాశాన వెన్నెల చూస్తుంటే చల్లని నీ ప్రేమే మాపైన కురిసే అయ్యప్పా

నువ్వే నా గానమయ్యా స్వామి నీవే నా ప్రాణమయ్యా
నా గుండెనే నీ ఆలయం నా మనసే నీ గోపురం

రామదాసుల రాగం తీయలేను అన్నమయ్యలా ఆలపించలేను
త్యాగయ్యలా నిన్ను తలవలేను శబరిలా పళ్ళు తినిపించలేను నేను
పూజా విధులు తెలియవు నాకు పువ్వు పత్రి పెట్టి నిన్ను కొలిచినా
నియమాలు ఏంటో తెలియవు స్వామి నిండు భక్తితో నిన్ను పూజించిన అయ్యప్పా

నువ్వే నా గానమయ్యా నువ్వే నా ప్రాణమయ్యా

నా గుండెనే నీ ఆలయం నా మనసే నీ గోపురం
నా చిత్తమే నీకు వత్తులు చేసి వెలిగించిన దీపం అయ్యప్పా
నువ్వే నా గానమయ్యా నీవే నా ప్రాణమయ్యా

స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
స్వామి శరణమయ్యప్ప శరణం శరణం శరణం అయ్యప్ప

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow