ఓం ధ్యాయేచ్చారు జటా-నిబద్ధ-మకుటం
దివ్యాంభరం జ్ఞాన-ముద్రోద్యదక్ష -కరం
ప్రసన్న-వదనం, జనుస్త-హస్తే స్థరం
మేఘ-శ్యామల-కోమలం, సురనుతం
శ్రీ-యోగ-పట్టాంచితం, విజ్ఞాన-ప్రద-మప్రమేయం
సుషమం, శ్రీ-భూతనాథం-విభుం
అర్థం
జటా మకుటాన్ని ధరించి,దివ్యాంబరాలను ధరించి,
కుడి చేతిలో జ్ఞాన ముద్రను చూపిస్తూ,
ప్రసన్న ముఖముతో,
మోకాలిపై చేతులను ఉంచుకొని,
మేఘ శ్యామల వర్ణముతో, సౌమ్య స్వరూపముగా,
దేవతలచే స్తుతింపబడుతూ,
యోగపట్ట ధారణతో,
అపారమైన విజ్ఞాన ప్రదాతగా,
సుందరమైన శోభతో కూడిన
శ్రీ భూతనాథ విభువును ధ్యానిస్తాను।