20. దిక్కు నీవే ఆంజనేయ దీనజన మందార | Dikku Neeve Anjaneya | హనుమాన్ భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

20. దిక్కు నీవే ఆంజనేయ దీనజన మందార | Dikku Neeve Anjaneya | హనుమాన్ భజన పాటల లిరిక్స్

దిక్కు నీవే ఆంజనేయ దీనజన మందార
నీ సేవలోనే ఒక స్వర్గముంది
నీపూజలునే పుణ్యముంది 
"దిక్కు నీవే ఆంజనేయ దీనజన మందార"
రఘరామా గుణధామా రఘు వంశాంబుది సోమ
అనుచూ మధిలో తలచీ ఆ లంకను దాటావు
అంగను సీతను చూచితివి
ఉంగర మామెకు ఇచ్చితివి "2"
కినుక భూని ఆ లంకాపురమును
క్షణములో కాల్సివేసితివి
"దిక్కు నీవే ఆంజనేయ దీనజన మందార"
ప్రభు భక్తితో పలుకరించి నిజభక్తిని నిలువరించి
ఘణమౌ ఆ నీరధిపై పెనువారధి పేర్చితివి
సంగరమందన సౌమిత్రి క్రుంగి నేలను కూలగనే
వనరౌ మూలిక క్షణాన తెచ్చి
మేలు కొలిపిన మహనీయా
"దిక్కు నీవే ఆంజనేయ దీనజన మందార"
ఘన నీయపు ఘణతతో-
మహనీయపు మహిమతో
రామాయణ కావ్యయునే రత్నమాల చేశావూ.
మేరు శరీర మహవీరా వందిత చరితా వాయుసుతా
నిరతము నీపద యుగాలి సేవను
మరవలేనురా మహనీయా
"దిక్కు నీవే ఆంజనేయ దీనజన మందార"

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow