Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

23. మాలవేయి తమ్ముడా... మరువబోకు తమ్ముడా... | Maala Veyi Tammuda | హనుమాన్ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
మాలవేయి తమ్ముడా... మరువబోకు తమ్ముడా...
వీరాంజనేయుణ్ణి మదిలోన తమ్ముడా...
రాంబంటు ఉన్నాడు... రక్షించే దేవుడు...
కొండగట్టు క్షేత్రమందు కొలువుదీరి ఉన్నాడు...
దండి దేవుడు భలే గొప్ప దేవుడు...
దయగల్ల అంజన్న ధర్మాత్ముడు...

సక్క సక్కని తీరొక్క సెట్లు ఉన్నవి
ఆ సెట్లన్నీ రాముణ్ణి కొలుస్తుంటవి
రామపాదము తాకిన గుట్టలున్నవి
ఆ గుట్టల్లో అంజన్న గుడి ఉన్నది
చూడముచ్చట అంజన్న కొండగట్టట
కోటి మహిమలున్న కొండగట్టట...

తరతరాలు కొండ పైన ఎండిపోనిది
గలగల పారేటి జలపుట్టుకుంది
సీతమ్మ తల్లి స్నానమాడెనన్నాడు
ఆ స్థలము చూసినాగాని పుణ్యము కలుగు
చూడముచ్చట అంజన్న కొండగట్టట
కోటి మహిమలున్న కొండగట్టట...
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow