25. కొండగట్టుపై వెలసినవయ్యా అన్నో అంజన్న | Kondagattupai Velasinavaiah | హనుమాన్ భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

25. కొండగట్టుపై వెలసినవయ్యా అన్నో అంజన్న | Kondagattupai Velasinavaiah | హనుమాన్ భజన పాటల లిరిక్స్

కొండగట్టుపై వెలసినవయ్యా అన్నో అంజన్న
కోటొక్క భక్తులకు అండగా ఉంటివే అన్నో అంజన్న
చూడ చక్కని సుందర రూపం నీదే అంజన్న
శ్రీ రామచంద్రుని పరమ భక్తుడవే అన్నో అంజన్న

లక్ష్మణ ప్రాణదాతవు నీవే
సీత జాడను తెచ్చిన వాడవే
సిరి సంపదలను కలిగించేటి
వీరాంజనేయుడవు నీవేనయ్య
వరమున పుట్టిన వానర వీరుడవు నీవే అంజన్న
ఓ బ్రహ్మచారి మా బాధలు తీర్చగా రావవ అన్నో అంజన్న

గుండంలో మేము స్నానము చేసి
గుడిలో నీకు పూజలు చేసి
అభిషేకాలు హారతులిచ్చి
మొక్కుకున్న నీ మొక్కులు తీర్చి
కొండ కోనలు దాటుకుంటా మేము అన్నో అంజన్న
నీ కొండగట్టుకు చేర వచ్చితిమి అన్నో అంజన్న

నిన్ను నమ్మిన భక్తులమయ్యా
మమ్ము చల్లగా చూడుము తండ్రి
రామ భజనలు చేసెదమయ్యా
నీదు మాలలే వేసెదమయ్యా
నిన్ను మరువము మదిలో ఎపుడు అన్నో అంజన్న
మా అండగా ఉండి దీవెనలిమ్ము అన్నో అంజన్న

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow