26. కొండగట్టు కొండల్లో కోటి మాయలున్న దేవుడవే | Kondagattu kondallo | హనుమాన్ భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

26. కొండగట్టు కొండల్లో కోటి మాయలున్న దేవుడవే | Kondagattu kondallo | హనుమాన్ భజన పాటల లిరిక్స్

కొండగట్టు కొండల్లో కోటి మాయలున్న దేవుడవే
ఆ గట్టుకి చూడంగ నువ్వేలే అంజన్న

నాదారి నాదారిలో
నాగులేటి దారిలో
నాదారి నాదారిలో...
॥ కొండగట్టు ॥
సింధూర పూతల్లో సుందరుడవైయ్యా
చందనాల కాంతుల్లో చక్కని దేవుడవైయ్యా

కొండగట్టు కొండ మీద
వేవేల వెలుగుల్లో అందాల అంజన్నవో

నాగులేటి దారిలో
నాదారి నాదారిలో...

వీరాధి వీరుడవో
వీరాంజనేయుడవో
॥ కొండగట్టు ॥
నీ విశ్వరూపాన్ని తిలకించినా చాలు
రాకాసి మూకలే రాలిపోవునయ్యా

నీ సాటి ఎవరయ్యా భూలోకమందు
కొండగట్టు మా అంజన్నా

నాగులేటి దారిలో
నాదారి నాదారిలో...

అతి బలవంతుడవో
అందాల మా అంజన్నా
॥ కొండగట్టు ॥
రోమ రోమమందు రామయ్య నామాన్ని
నింపుకున్న దండయ్య నిజమైన భక్తుడవు

లోకాన నీకన్నా భక్తుడు లేడయ్యా
అంజన్న మా అంజన్నా

నాగులేటి దారిలో
నాదారి నాదారిలో...

కోటి కోటి దండాలయ్యా
కొండగట్టు మా అంజన్నా
॥ కొండగట్టు ॥

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow