నిన్ను కొలుచుకుంటామయ్యా మా అంజన్న
మండల మాలలు వేసి అంజన్న
నీ భజనలు చేసేము ఓ అంజన్న
శ్రీ రామ దూతవయ్యా మా అంజన్న
మా చింతలు తీర్చవయ్యా మా అంజన్న
శుక్రవారం నాడు.. మంగళవారం నాడు
నిష్టతోటి నీ పూజ చేసేము అంజన్న
జిల్లేడు పూల దండ నీకేతుము అంజన్న
తమలపాకుల మాల నీకేతుము అంజన్న
కరుణతోటి మమ్ము నీవు చూడవయ్యా
కష్టాల నుండి మమ్ము కాపాడవయ్యా
కొండగట్టు గుట్ట మీద కొలువున్నావయ్యా
కోటి మంది భక్తులకు అండవైనావయ్యా
నీ నామ స్మరణతో పులకించి పోతాము
నీ పాద సేవలో తరించి పోతాము
శక్తి స్వరూపుడవు నీవే అంజన్న
భక్తితో మేము నిన్ను పిలిచేము అంజన్న
ఆపదలు వచ్చిన వేళ ఆదుకో రావయ్య
అండగా నీవుంటే మాకు భయమేల
హనుమాన్ చాలీసా చదువుకుంటామయ్యా
అంజన పుత్రుడవు నీవేనని నమ్ముతాము
మమ్ము దీవించుమయ్య మా అంజన్న
నీ దయ మాపైన ఉంచు అంజన్న