50. పుంసవన విధిః | Pumsavana Vidhi | Veerashaiva Purohitam
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

50. పుంసవన విధిః | Pumsavana Vidhi | Veerashaiva Purohitam

అథ పుంసవన విధిః

మునుముందు గణేశ పూజను, గౌరీ పూజను, పుంసవనమును జేయవలెను. పుంసవనము కార్యారంభమునకు మొదటి దినమున శుచియై కంకణము (ప్రాయశ్చిత్తము)న జేసి నిత్య కర్మలను ముగించుకొని, మంగళస్నానము గావించి, శివపూజాది కర్మలను ప్రారంభించి, పతి పత్నిని తన కుడిప్రక్కన గూర్చుండ బెట్టుకొని, ఆచమన (ప్రాణాయామము)ను జేసి దేశ కాలములను జేర్కొని,

సంకల్పము :- 
“ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ ధర్మ పత్న్యాః గర్భాదానాది జనిత దోష పరిహారార్థం, అప్రారబ్ధ సంస్కారార్థం అఘమర్షణ పూర్వకం పుంసవనాఖ్యం కర్మ కరిష్యే ||”

అని సంకల్పమును జెప్పి పుంసవన కార్యరంగ భూతములైన స్వస్తి పుణ్యాహవాచనాది వాటిని (మధ్యాహ్న విధిలో చెప్పబడిన రీతిగా) ఆచరించవలెను.

రెండవ దినమునందును శివపూజాది నిత్యకర్మలను గావించి, సకలమైన రక్షా దీపారాధనను జెప్పి,

మంత్రము :- 
“ఏవంగుణ శుభతిథౌ ధర్మపత్నీ సమేతస్యమమ పుంసవనాంగత్వేన ఉభయోఃరక్షార్థం రక్షాబంధ నాఖ్యం కర్మ కరిష్యే”

అని సంకల్పమును జెప్పి, ఒక తాంబూలములో బియ్యమును బోసి, అందు తమలపాకులు, పోకలు, టెంకాయ, భస్మము, వీనినుంచి, కంకణమును బెట్టి (పూజా ప్రకరణములో జేప్పిన విధముగా షోడశోపచారములతో బూజించి,

మంత్రము :- 
“త్రయంబకం యజామహే, సుగంధిం పుష్టి వర్ధనం | ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయ మామృతాత్” అని యుచ్చరించి, భస్మలేపన మొనర్చి,

మంత్రము :- “
విశ్వాతా తేన వేనేమ ప్రవాచాయాచకత్థ మఘవన్నింద్ర సున్వతే పారావతం యత్పురుసంభృతంవస్యపావృణోః శరభాయ ఋషిబంధవే” అని పురుషుని కుడిచేతికి,

మంత్రము :- 
“బృహత్సమ క్షత్రభృద్వృద్ధ వృష్ణాయం | త్రిష్టుభౌజు శ్శుభితముగ్రవీరం | ఇంద్రం సోమేన పంచదశేన మధ్య మిదం వాతేన సగరేణ రక్ష”

ఈ మంత్రమునుచ్చరించి స్త్రీ యెడమ చేతికి గట్టవలెను. ఆ మీదట భర్త మినుములు, గోధుమలు, పెరుగులో గల్పి దానిని పత్నికివ్వగా, ఆమె

మంత్రము :- “పుగ్ంసవనమసి”

అని చెప్పి తినవలెను. ఇదే విధముగా మూడు సార్లు భర్త ఇవ్వవలెను. పత్ని మూడు సార్లు స్వీకరించి సేవించవలెను. (దీనికే అనవలోకన మందురు.)

తరువాత భర్త తెల్లని గరిక దంచి (క్రొత్త వస్త్రములో బెట్టి, పత్నిని అంతర్గృహమునకు దోల్కెళ్ళి, వెనుక గర్భాధాన విధిలో జెప్పిన గర్భాధాన సూక్తము

మంత్రము :- 
“అతగర్భ్యోయోనిమేతు పుమాన్బాణ ఇవేషుధిం” అని ప్రారంభించి సంపూర్ణ సూక్తమును బఠించి, పత్ని కుడి ముక్కులో పిండవలెను.

పిదప గురు-జంగమముల సన్నిధిలో

మంత్రము :- 
కంకణేన, కంకణేధౌ సతీన కంకతః | ద్వాపిరి పృపి ఇతన్వా అదృష్టే అలిప్సతా || కంకణం మోచయామ్యద్య రక్షాస్మిన్న కదాచన | మయి రక్షాం స్థిరాబద్ధ్వా దేవత్వం గచ్ఛ కంకణ ||

అని యుచ్చరించి కంకణమును విడదీయవలెను.

(ఇతి పుగ్ంసవనం)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow