51. సీమంత కర్మ | Seemantha karma
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

51. సీమంత కర్మ | Seemantha karma

సీమంత కర్మ

సీమంత కర్మమును 4-6-8, మాసములలో శుక్ల పక్షము పురుష నక్షత్రముల యందు జేయవలెను. గృహమును పూర్వోక్త ప్రకారముగా ఇల్లంతా సమ్మార్జన యొనర్చి రంగు ముగ్గులతో నలంకరింపజేసి, స్వస్తి వాచనానాందీ సమారాధనలను ఆచరించి, పరిశుద్ధమైన స్థలమున భద్ర పీఠముపై కుడి ప్రక్కన భార్యను గూర్చుండ బెట్టుకొని ప్రాణాయామము నొనర్చి,

మంత్రము :- 
“ఏవంగుణేత్యాది శుభతిథౌమమై తస్యాః ధర్మపత్న్యాః గార్భిక బైజిక దోష పరిహారార్థం క్షేత్ర సంస్కారార్థం ప్రథమ గర్భ సంస్కార ద్వారా సర్వ గర్భ సంస్కారార్థంచ సీమంతోన్నయనాఖ్యం కర్మ కరిష్యే”

అని సంకల్పించి, పునః ప్రాణాయామము నాచరించి,

మంత్రము :- 
“ఏవంగుణ......శుభతిథౌ సీమంతోన్నయనాంగత్వేన ఉభయోరక్షార్థం, రక్షాబంధనం కరిష్యే” అని సంకల్పమును పఠించి (ఇంతకు పూర్వము పుంసవనమునందు జెప్పిన విధముగా) కంకణమును బూజించి ధరింపజేయవలయును. ఆ పిదప భార్యను తూర్పు ముఖముగా గూర్చుండబెట్టి, తాను పడమర దిశగా నెదుట గూర్చుండి, మూడు అడవి పందియొక్క వెంట్రుకలు, మూడు దర్భగుతి, మేడి చిగుళ్ళను జతజేసి పట్టుకొని, నుదురు మొదలగొని పాపెట దీసినంతవరకు,

మంత్రము :- 
“ఓం భూర్భువస్సువోరాకామహగ్ం సుహవాగ్ం సుష్టుతీ హువేళ్ళృణోతునస్సుభగాబోధతుత్మనా | సీవ్యత్వ పస్సోచ్యచ్ఛిద్యమాన యాదదాతు | వీరగ్ం శతదాయ ముక్త్యం | యాస్తేరాకే సుమతయస్సువృశసో యాభిర్దదాశి దాశుషేవసూని | తాభిర్నో అద్య సుమనాఉపాగహి | సహస్ర పోషగ్ం సుభగేరరాణ”

అను మంత్రమును ఉచ్చరించి, మూడు సార్లుగాని, నాలుగు సార్లు గాని, వ్రాసి వాటిని అక్కడే ఉంచి ఆగ్రామమునకు సమీపములోనున్న నదిని ధ్యానించి, భార్య కంఠములో (మొదట స్పృశించి వరుసగా దండ గుచ్చినట్లు) గోధుమల మాలను వేయవలెను. తదుపరి,

మంత్రము :- 
“గాయేతామితి వీణాగాధి నానసగ్ం శాస్త్రి | సోమయే వనోరాజేత్యాహుర్వార్బహ్మణీ ప్రజాః | వివృత్తచక్ర ఆసీనాస్తీ రేణాయమునే తవ ||

అనిచెప్పి వీణాగానమును జేయించి, ముత్తైదువలు మంగళ ప్రదమైన పాటలను బాడిన బిదప మాహేశ్వరులచేత ఆశీర్వాదములనుబడసి దేవ-గురు సన్నిధిలో (సమ్ముఖమున) కంకణ విసర్జనము జేయవలెను. కర్మాంగము ననుసరించి యథాశక్తి మాహేశ్వరా రాధన జేయవలెను.

(ఇది సీమంత విధి)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow