బాలుడు ఐదు సం||ముల ప్రాయముగల వాడు కాగానే జ్యోతిశ్శాస్త్రము ప్రకారము శుభముహూర్తములో ప్రమథ గణాధీశుని (గణపతిని) పార్వతీదేవిని, పరమేశ్వరుని, శారదాదేవిని, గురు-లింగ-జంగమంబులను భక్తితో బూజించి, తల్లీ, సోదరి మొదలగువారికి ప్రదక్షణ నమస్కారమును జేసి విద్యా గురువుల వారికి నమస్కరించగా, వారు “ఓం” అను అక్షరమును తాను వ్రాసి, తదుపరి అదే విధముగా బాలుని చేత వ్రాయించి చదివించవలెను. అక్కడికి విచ్చేసిన వీరమాహేశ్వరులకు దక్షిణ తాంబూలాదుల నొసగి ఆనందింపజేయవలెను.
ఇది విద్యారంభ విధానము
