Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

56. విద్యారంభమునకు ముహూర్తములు | Vidyarambhamu Muhurthams | Veerashaiva Purohitam

P Madhav Kumar

విద్యారంభమునకు ముహూర్తములు

ఉత్తరాయణమున శుభమాసములలో అనగా మాఘాది అయిదు మాసములందును; స్వాధ్యాయ దినములలోను అనగా 1-8-14-15-30 తిధులను వదలి 2-3-5-10-11-12-13 తిధులలోను, బుధ, గురు, శుక్ర - ఈ వారములలో, రేవతీ, అశ్వినీ, పుష్య-పునర్వసు, అనూరాధా, ఆర్థ్రా, శ్రవణ, హస్త, చిత్త, స్వాతి, ఈ నక్షత్రములలోను మరియు ముహూర్త చింతామణి మతానుసారము ధనిష్ఠ, శత తారక, త్రిపూర్వ, త్రిఉత్తరా, మూల, ఆశ్లేష, ఈ నక్షత్రములందును విద్యారంభముజేయుట ప్రశస్తమైనది. వృషభ, మిధున, కన్యా, ధను, మీన ఈ శుభ లగ్నములందును త్రికోణ (5-9) కేంద్రము (1-4-7-10) ఈ స్థానములలో శుభగ్రహములున్నప్పుడు కుమారుని 5వ సం॥ములో గణపతి, సరస్వతి, శివ-పార్వతుల నర్చించి పూర్వాహ్లములో విద్య నారంభించవలెను.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow