Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

55. మంటప దేవతా ప్రతిష్ఠ | Mantapa Devata Pratishtha | Veerashaiva Purohitam

P Madhav Kumar
మంటప దేవతా ప్రతిష్ఠ

యజమాని దేశకాలాదుల నుచ్చరించి

మంత్రము :- 
"ఏవం గుణ... అస్యాం శుభతిథౌ (శ్వః కరిష్యమాణ) అథవా (అద్య కరిష్యమాణ) దీక్షా కర్మాంగ భూతమంటప దేవతా స్థాపనం కరిష్యే" ఈ విధముగా సంకల్పించి

మంత్రము :- 
"యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయశ్చ పుష్పిణీః । బృహస్పతి ప్రసూతాస్తానో ముంచత్వగం హసః"

ఈ మంత్రమును పఠించి మంటపముపై అక్షంతలు వైచి (చల్లి) ఇంద్ర (పూర్వ) దిక్కులో

మంత్రము :- 
"త్రాతారమింద్రమవితార మింద్రగ హవేహవే । సువగం శూరమింద్రం హవేను శక్రం పురుహూత మింద్రగ స్వస్తినో మఘవాధత్వింద్రః"

ఇతి మంత్రేణ ఇంద్ర మావాహయామి

అని యుచ్చరించి ఇంద్రుని ఆహ్వానించి ఇంద్రపూజితులైన దశ రుద్రులను

మంత్రము :- 
"కపిలేశాయనమః । అజాయనమః । బద్భాయ నమః । వజ్రదేహాయ నమః । ప్రమర్దనాయ నమః । విభూతయే నమః । అవ్యయాయ నమః । శాస్త్రే నమః । పినాకినే నమః । త్రిదశాధి పాయ నమః । ఇంద్ర వీర్యాః ఇంద్రపూజితాః హే దశరుద్రాః సవాహనాస్స శక్తయస్స పరివారా సమాగత్యా త మంటపే మత్కృతాన్ శేషోపచారాన్తీకృత్య ప్రసీదంతు భవతు ॥"

అని ఆహ్వానించి పంచోపచారములతో బూజించవలెను. ఆ పిదప ఆగ్నేయదిశలో

మంత్రము :- 
"త్వన్నో అగ్నేవరుణస్య విద్వాన్ దేవస్యహే డోవయాసిసిష్ఠాః । యజిష్ఠో వహ్నిత మశోశుచానో విశ్వాద్వేషాగంసి ప్రము ముగ్ధ్యస్మత్ ॥" ఇతి మంత్రేణాన్ని మావాహయామి

అని ఆహ్వానించి అగ్నిపూజిత దశరుద్రులను

మంత్రము :- 
"అగ్ని వీర్యాయనమః । హుతాశినే నమః । పింగళాయనమః । ఖాదకాయనమః । హరాయనమః । జ్వాలాయనమః । దహనాయ నమః । బభ్రవేనమః । భస్మాంతకాయ నమః । క్షయాంతకాయ నమః । అగ్నివీర్యాః అగ్నిపూజితాః హే దశరుద్రాః । (సవాహనస్స శక్తయస్స పరివారా సమాగత్యాత్ర మంటపే మత్కృతావశేషోపచారాన్ స్వీకృత్య ప్రసీదంతు భవతః)"

అని ప్రతి దిశలో నున్న (దశరుద్రాః) ప్రసీదంతు భవతః । దశరుద్రుల నాహ్వానించి, పూజించిన తరువాత దక్షిణ దిశలో

మంత్రము :- 
"సుగన్ను పంథామభయంకృణోతు । యస్మిన్ క్షత్రేయ మయేతి రాజా । యస్మిన్నైనమభ్యషించదేవాః । తదస్య చిత్రగం హవిషాయజామ"

ఇతి మంత్రేణ యమమావాహయామి అనియు యముని నాహ్వానించి

మంత్రము :- 
"విధాత్రే నమః । కర్త్రేనమః । ధాత్రేనమః । శ్రీ కామాయ నమః । సర్వనియోక్త్రే నమః । యామ్యేశాయ నమః । రమేశాయనమః । సంయోక్త్రే నమః । హరాయనమః । యమవీర్యాః యమపూజితాః హే దశరుద్రాః సవా... ప్రసీదంతు భవతః"

అని చెప్పి దశరుద్రుల నాహ్వానించి పూజించవలెను. నైరుతి దిశలో

మంత్రము :- 
"అసున్వంతం యజమాన మిచ్ఛస్తే నస్తేత్త్యాం తస్కర స్యాన్వేషి । అన్యమస్మదిచ్ఛాసా త ఇత్యానమోదేవినిఋృతే తుభ్యమస్తు" ఇతి మంత్రేణ నిఋృతి మావాహయామి అని నైఋతి నాహ్వానించి

మంత్రము :-
 "నైఋతేశాయనమః । వరుణాయనమః । హంత్రేనమః । క్రూరదృష్టయేనమః । భయానకాయనమః । ఊర్ధ్వ కేశాయనమః । విరూపాక్షాయ నమః । ధూమ్రాయనమః । లోహితాయ నమః । దంష్ట్రాకాయ నమః । నైఋతి వీర్యాః నైఋతి పూజితాః హే దశరుద్రాః సం... ప్రసీదంతు భవతః"

అని ఉచ్చరించి నైఋతిచేత పూజింపబడిన దశరుద్రులను ఆవాహించి బూజించవలెను.

వరుణుడు పశ్చిమదిశలో

మంత్రము :- 
"తత్వాయామి బ్రహ్మణా వందమానస్తదాశాస్తే యజమానో హవిర్భిః । ఆహేడమానో వరుణేహ బోధ్యురుశగం సమాన ఆయుః ప్రమోషీః" ఇతి మంత్రేణ వరుణమావాహయామి

అని వరుణుని నాహ్వానించి వరుణుచేత పూజితులైన

మంత్రము :- 
"బలాయనమః । అతి బలాయనమః । పాశహస్తాయ నమః । మహా బలాయనమః । శ్వేతాయనమః । జయభద్రాయ నమః । దీర్ఘ బాహవే నమః । బలాంతకాయ నమః । బడబా ముఖాయ నమః । భైరవాయ నమః । వరుణవీర్యాః వరుణ పూజితాః హే దశరుద్రాః, సం... ప్రసీదంతు భవతః ॥"

అని చెప్పి దశరుద్రునాహ్వానించి, పూజించవలెను. వాయవ్యదిక్కులో

మంత్రము :- 
"ఆనోనియుద్భిశ్శతినీ భిరధ్వరం । సహస్రిణీభిరుపయాహి యజ్ఞం । వాయో అస్మిన్ హవిషమాదయస్వయూయం పాత స్వస్తిభిః సదానః" ఇతి మంత్రేణ వాయుమావాహయామి

ఈ మంత్రముచేత వాయువును ఆహ్వానించి పూజించిన తరువాత దశరుద్రులను

మంత్రము :- 
"శీఘ్రాయనమః । లఘువేనమః । వాయువేగాయ నమః । సూక్ష్మాయనమః । తీక్షణాయ నమః । భయంకరాయ నమః । పంచాత్మకాయ నమః । పంచశిఖాయ నమః । కపర్దినే నమః । మేఘవాహనాయ నమః । వాయువీర్యాః వాయుపూజితాః హే దశరుద్రాః" సం... ప్రసీదంతు భవతః

అని ఆవాహించి పూజించవలెను. కుబేర (ఉత్తర) దిశలో

మంత్రము :-
 "వయగ్ం సోమప్రతేతవ మనస్త నూషుబి భ్రతః ప్రజావంతః సచామహే । ఇంద్రాణీదేవి సుభగాసుపత్నీ"

ఇతి మంత్రేణ కుబేరమావాహయామి ॥ అని కుబేరునాహ్వానించి, కుబేరుని పూజించి, దశరుద్రులను


మంత్రము :- 
"నిధీశాయ నమః । రూపవతే నమః । ధన్యాయనమః । సౌమ్యాయ నమః । శాంతాయ నమః । జటాధరాయ నమః । కామ ప్రసాదాయ నమః । లక్ష్మీశాయ నమః । ప్రకాశాయ నమః । ఇందుయజ్ఞాయ నమః । కుబేరవీర్యాః, కుబేర పూజితాః హేదశరుద్రాః సం... ప్రసీదంతు భవతః"

అని ఆహ్వానించి పూజించవలెను. ఈశాన్య దిశలో

మంత్రము :- 
"తమీశానం జగతస్తస్థుషస్పతిం । ధియం జిన్వమవసేహూమహేవయం । పూషనో యథా వేదసామ సద్వృధే । రక్షితా పాయురదబ్ధ స్వస్తయే" ఇతి మంత్రేణ ఈశానమావాహయామి

అని ఈశానుని ఆవాహించి ఈశానునిచేత బూజితులైన దశరుద్రులను

మంత్రము :- 
"ఈశానాయ నమః । విద్యేశాయ నమః । జ్ఞానవతే నమః । మాతృపింగళాయ నమః । భూతపాలాయ నమః । అజాయ నమః । బలయే నమః । మిత్రాయ నమః । సర్వవిద్యాధిపాయ నమః । ముఖికృతయే నమః । ఈశానవీర్యాః, ఈశాన పూజితాః, హే దశరుద్రాః సం... ప్రసీదంతు భవతః" (ఈ మంత్రముతో నావాహించి పూజించవలెను.) అధో (వాయవ్య పశ్చిమ దిక్కుల మధ్య) దిశలో,

మంత్రము :- 
("స్యోనా పృథివీ భవానృక్షరానివేశినీ । యచ్ఛానః శర్మ సప్రథా) "ఇతి మంత్రేణ విష్ణు మావాహయామి" అని విష్ణువు నావాహించి, విష్ణువుచేత బూజితులైన దశరుద్రులను

మంత్రము :- 
"బలిప్రియాయనమః । విషధరాయనమః । విరోగ్రసనాయ నమః । పాలకాయ నమః । శుభాయ నమః । సువీర్యాయ నమః ।వృషభాయ నమః । పాతాళేశాయ నమః । లోహితాయ నమః । అనంతాయ నమః । విష్ణువీర్యాః, విష్ణు పూజితాః, హే దశరుద్రాః సం... ప్రసీదంతు భవతః" ఈ మంత్రముతో నాహ్వానించి పూజించవలెను. ఊర్ధ్వ (ఈశాన్య దిశల మధ్య) దిక్కులో

మంత్రము :- 
"ఆస్మెరుద్రా మేహనాపర్వతాసోవృత్రహత్యే భరహూతౌ సజోషాః । యస్యం సతేస్తు వతేధాయి వజ్రమింద్రజ్యేష్ఠా అస్మాన్ అవంతుదేవాః" ఇతి మంత్రేణ బ్రహ్మ మావాహయామి

అని బ్రహ్మనాహ్వానించి బ్రహ్మ పూజితులైన దశరుద్రులను

మంత్రము :- 
"అధ్యక్షాయ నమః । నభసే నమః । రిప్యవే నమః । శంభవే నమః । విభవే నమః । గణాధ్యక్షాయ నమః । వివాహాయ నమః । గుణసంవాహాయ నమః । త్ర్యక్షాయ నమః । త్రిదశ వందితాయ నమః । బ్రహ్మవీర్యాః బ్రహ్మపూజితాః, హే దశరుద్రాః సవాహనా సశక్తయస్సపరివారా సమాగత్యాత్ర మంటపే మత్కృతావ శేషోపచారం త్నీకృత్య ప్రసీదంతు భవతః"

అని ఆహ్వానించి పూజించవలెను. ఆ మీదట

మంత్రము :- 
"క్షేత్రైయ్యైత్వానిర ఋృత్యైత్వాద్యపోముంచామి వరుణస్య పాశాత్ । అనాగసంబ్రహ్మణేత్వా కరోమి శివేతేద్యావా పృథివీ ఉభేఇమే"

ఈ మంత్రము నుచ్చరించి దర్భతో జేసిన (25) ఇరువదియైదు మూరలున్న త్రాడుతో మంటపమునకు జుట్టి కట్టవలెను.

(ఇది మంటపదేవతా ప్రతిష్ఠ)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow