Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

57. వివాహమునకు మాస - వార - నక్షత్రములు | Marriage Muhurthams | Veerashaiva Purohitam

P Madhav Kumar
వివాహమునకు మాస - వార - నక్షత్రములు

మాఘము, ఫాల్గుణము, వైశాఖము, జ్యేష్ఠము - ఈ మాసములు వివాహములకు యోగ్యమైనవి. మార్గశిర మాసము మధ్యమము, మిధున, సంక్రాంతిలో ఆషాఢమాస ముండినను వివాహము చేయుటకు శుభము. కొన్నిచోట్ల సూర్యుడు వృశ్చికరాశికి వచ్చినపిదప కార్తీకమాసములోను వివాహకర్మము నాచరించుటగలదు.

షష్ఠి — అమావాస్య — అష్టమి — రిక్తా — (4-9-14) తిధులు.

కృష్ణ పక్షములోని చివరి అయిదు తిధులు, శుక్ల పక్షములోని ప్రతిపద తిధులు వివాహమునకు పనికిరాదని ముహూర్త గణపతి గ్రంథములోనున్నది.

అయినను షష్ఠి - అష్టమి - శుక్ల చతుర్దశి తిధులలో వివాహము చేయుట శుభమని కొందరు గ్రంథకారులు చెప్పియున్నారు. అమావాస్యమాత్ర సర్వత్రత్యాజ్యమే. (వదలవలెను.)

పండితుల మతాధిక్యతచేత సమస్త వారములు వివాహమునకు చెప్పబడినవి. త్రి. ఉత్తరా, రోహిణి, హస్త, అనూరాధా - రేవతి - మఘా, స్వాతి, మూల, మరియు మృగశిర - ఈ పదునొకండు నక్షత్రములు వివాహమునకు ప్రశస్తములైనవి. ఇవే గాకుండా హరదత్తాచార్యుని మతానుసారము ధనిష్ఠ, శ్రవణము, చిత్తా, అశ్వినీ - ఈ నాలుగు నక్షత్రములైనను శుభములనే చెప్పబడినవి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow