ధ్యాన మంత్రము
మంత్రము :-
“సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః |
లంబోదరశ్చ వికటో - విఘ్ననాశో గణాధిపః || ౧ ||
ధూమ్రకేతుర్గణాధ్యక్షో - ఫాలచంద్రో గజాననః |
ద్వాదశైతాని నామాని - యః పఠేచ్ఛృణుయాదపి || ౨ ||
విద్యారంభే వివాహేచ - ప్రవేశే నిర్గమే తథా |
సంగ్రామే సంకటే చైవ - విఘ్నస్తస్య న జాయతే || ౩ ||
వక్రతుండ మహాకాయ - సూర్యకోటి సమప్రభః |
అవిఘ్నం కురు మే దేవ - సర్వకార్యేషు సర్వదా || ౪ ||”
ఈ విధముగా ధ్యానించి నమస్కరించవలెను. తరువాత తాను పూజించే దేవతను స్మరించి స్థిర మనస్సుచేత పూజను జేయవలయును.
ఉదా :- శివుని ధ్యానించుటకు
“ధ్యాయేన్నిత్యం గిరీశం రజతగిరినిభం - చారుచంద్రావతంసం రత్నాలోక జ్వాలాంగం పరశు మృగవరా భీతిహస్తం ప్రసన్నం - పద్మాసీనం సమంతాత్ స్తుత మమరగణైర్వ్యాఘ్ర కృత్తిం వసానం విశ్వాద్యం విశ్వరూపం నిఖిల భయహరం పంచవక్త్రం త్రినేత్రం”
అని శివసంస్మరణను శ్రీ జగద్గురు రేణుకార్యులను మరియు బసవేశ్వరుని ఆరాధించుతరి
“తీక్ష్ణ శృంగం విశాలాక్షం - వేదపాదం మహోన్నతం | సాక్షాద్ధర్మతనుందేవం - శివరూపం వృషేశ్వరం ||”
అని వృషభేశ్వరుని స్మరించి
ఇదే ప్రకారముగా పూజనీయ దేవతా ధ్యానమును జేసి తదుపరి ఆ దేవతను ఆవాహించి షోడశోపచారములతో పూజించవలెను. (ఉపచార ప్రారంభము)
