అస్త్ర మంత్రం:
ఓం జ్వలఖ్రిణి హుం ఫల్ ॥
మూల మంత్రం:
ఓం ఖ్రూం నమః పరాయ గోప్త్రే ॥
1.1 అభివాద్యం ముద్ర
అభివాదన ముద్ర విధానం:
మంత్రం జపిస్తున్నప్పుడు బొటనవేలు (Thumb) మరియు ఉంగర వేళి (Ring Finger)తో చెవి పాపల(ear lobes)చివరలను పట్టుకోవాలి.
అనంతరం చెవి పాపల పట్టును విడిచేయాలి.
అయితే బొటనవేలు మరియు ఉంగర వేళిని కలిపిన స్థితినే కొనసాగించాలి.
తరువాత చేతులను దాటించి, కుడిచేతిని పైగా మరియు ఎడమచేతిని కిందగా ఉంచాలి.
ఆ స్థితిలో మీ పాదాల ముందున్న నేలను స్పర్శించాలి.
గమనిక:
మీరు “భోః” అని పలికే సమయంలో కూడా బొటనవేలు మరియు ఉంగర వేళి కలిపిన స్థితినే కొనసాగిస్తూ నేలను స్పర్శించాలి.
చేతులు దాటించినప్పుడు కుడిచేతి గురువు లేదా దేవతామూర్తి పాదాల కుడివైపున ఉండాలి.
మంత్రం:
“ఓం అభివాదయే ।
(మీ పేరు) శర్మానామా, అహం అస్మి భోః ॥”