Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

94. ఎక్కడ లేడమ్మా శివుడు ఎక్కడ లేడమ్మా | Ekkada ledamma shivudu | శివ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
ఎక్కడ లేడమ్మా శివుడు ఎక్కడ లేడమ్మా
ఎక్కడ లేడమ్మా శివుడు ఎక్కడ లేడమ్మా
ఎక్కడ లేడమ్మా శివుడు ఎక్కడ లేడమ్మా
అక్కడ, ఇక్కడ, ఎక్కడ చూసినా
చక్కని దేవుడు పార్వతినాథుడు
ఎక్కడ లేడమ్మా శివుడు ఎక్కడ లేడమ్మా॥

కోయిల పాడే పాటల్లోన,
కొమ్మన విరిసిన పూవుల్లోన,
పసిపాపల చిరునవ్వుల్లోన,
మమతలు నిండిన మనసుల్లోన.
ఎక్కడ లేడమ్మా శివుడు ఎక్కడ లేడమ్మా
అక్కడ, ఇక్కడ, ఎక్కడ చూసినా
చక్కని దేవుడు పార్వతినాథుడు
ఎక్కడ లేడమ్మా శివుడు ఎక్కడ లేడమ్మా॥

గలగల పారే ఏరుల్లోన,
మిలమిల మెరిసే తారల్లోన,
గుంపుగా ఎగిరే గువ్వల్లోన,
సొంపుగా పెరిగే పైరుల్లోన.
ఎక్కడ లేడమ్మా శివుడు ఎక్కడ లేడమ్మా
అక్కడ, ఇక్కడ, ఎక్కడ చూసినా
చక్కని దేవుడు పార్వతినాథుడు
ఎక్కడ లేడమ్మా శివుడు ఎక్కడ లేడమ్మా॥

మెల్లగా సాగే మేఘములోన,
చల్లగా వీచే పవనములోన,
ఎల్లలు లేని నీ విశ్వములోన,
కల్లలెరుగని హృదయములోన.
ఎక్కడ లేడమ్మా శివుడు ఎక్కడ లేడమ్మా
అక్కడ, ఇక్కడ, ఎక్కడ చూసినా
చక్కని దేవుడు పార్వతినాథుడు
ఎక్కడ లేడమ్మా శివుడు ఎక్కడ లేడమ్మా॥

పూరి మధ్యలో, పూరి గుడిసెలో,
దారి లేని ఆ కొండ కోనలో,
తరచి చూసిన నీలో నాలో,
ఎక్కడ చూసినా అక్కడ తానై.
ఎక్కడ లేడమ్మా శివుడు ఎక్కడ లేడమ్మా
అక్కడ, ఇక్కడ, ఎక్కడ చూసినా
చక్కని దేవుడు పార్వతినాథుడు
ఎక్కడ లేడమ్మా శివుడు ఎక్కడ లేడమ్మా॥
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow