Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

ప్రశ్న: మాలధారణ తరువాత భక్తునిలో వచ్చే మార్పులు ఏమిటి? | What changes occur in a devotee after the *Mala* (sacred garland) is worn?

P Madhav Kumar

సమాధానం:

అయ్యప్ప మాలధారణ చేసినప్పటి నుండి ఆ భక్తుని నడవడికలో ఎన్నో అద్భుతమైన మార్పులు వస్తాయి.

మాల ముద్ర అనుగ్రహంతో ప్రాప్తించే ముఖ్యమైన ప్రయోజనాలు..

​ఉత్తమ దినచర్య - క్రమశిక్షణ.

ప్రాతఃకాలమే నిద్రలేవడం, తలస్నానం చేయడం, నిత్య పూజ, ఆలయ దర్శనం, సాత్త్విక ఆహారం తీసుకోవడం వల్ల జీవితంలో ఒక అద్భుతమైన క్రమశిక్షణ అలవడుతుంది.

​ఆధ్యాత్మిక వికాసం.. భయభక్తులు వృద్ధి చెంది, ఆలోచనా విధానం మారుతుంది.

ఏది ధర్మం? ఏది అధర్మం? అనే విచక్షణ కలుగుతుంది.

ఆధ్యాత్మికత ఒక జీవన విధానంగా మారుతుంది.

​దురలవాట్లకు దూరం. ఈ దీక్షా సమయంలో ఆచరించే నియమనిష్ఠల వల్ల వ్యసనాలు, దురలవాట్లు దానంతట అవే దూరమైపోతాయి.

​మానవతా విలువలు. సద్భావాలతో నిండిన మానవతా విలువలు వృద్ధి చెందుతాయి.

తోటివారి పట్ల ప్రేమ, గౌరవం పెరుగుతాయి.

​మానసిక ప్రశాంతత. బుద్ధి వికసించి, సిద్ధి సిద్ధిస్తుంది. నిరంతర స్వామి నామస్మరణతో మనసుకు అంతులేని ప్రశాంతత చేకూరుతుంది.

​ఇలా ఎన్నో లౌకిక లాభాలను, అలౌకిక ఆనందాలను చేకూర్చే అయ్యప్ప దీక్షను స్వీకరిద్దాం.

ఆ మహిమలను స్వయంగా అనుభూతి చెందుదాం.

అద్భుత రీతిలో ప్రవహించే శరణు సాగరంలో మునకలు వేద్దాం. ఆనందమయమైన ఆధ్యాత్మిక జీవన విధానాన్ని సొంతం చేసుకుందాం.

​మానవులుగా పుట్టినందుకు ఆదర్శవంతమైన జీవులుగా జీవిద్దాం. సన్మార్గంలో నడచి "సత్యాన్ని" తెలుసుకుందాం.

ఆ జ్యోతి స్వరూపుని కన్నులారా దర్శించి సద్గతిని పొందుదాం. ఈ జన్మను సార్థకం చేసుకుందాం!

​🌺 ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🌺

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow