నీ పూజలు చేసినామయ్యా ఓ దేవ దేవ నీ శరణం కోరినామయ్యా||2||
మత్యావతారుడవు కూర్మావతారుడవు
వేదములు తెచ్చినావయ్యా ఓ దేవ దేవ బ్రహ్మదేవుడకిచ్చినావయ్యా ||2||
||శివకేశవుడైన నీవు ||
శ్రీరాముడన్న నీవు శ్రీకృష్ణుడన్న నీవు ||2||వారధిని దాటినావయ్యా ఓ దేవ దేవ పది తలలు కూల్చినావయ్యా ||2||
||శివకేశవుడైన నీవు ||
గోవిందుడన్న నీవు గోపాలుడన్న నీవు ||2||గోవులనే కాచినావయ్యా ఓ దేవ దేవ కంసున్నే చంపినావయ్యా ||2||
||శివకేశవుడైన నీవు ||
నరసింహుడన్న నీవు నారాయణుడన్న నీవు ||2||హిరణ్య కసిపునీ చంపినావయ్యా ఓ దేవ దేవ ప్రహ్లాదుని కాచినావయ్యా ||2||
||శివకేశవుడైన నీవు ||
వామనావతారుడవు వరాహవతారుడవు ||2||మూడడుగులు కోరినావయ్యా ఓ దేవ దేవ ధరణి నెల్ల మోసినావయ్యా ||2||
||శివకేశవుడైన నీవు ||
పాండురంగడన్న నీవు పరమాత్ముడన్న నీవు ||2||విఠల విఠల బ్రోవరావయ్యా ఓ దేవ దేవ విశ్వమంత నిండినావయ్యా ||2||
||శివకేశవుడైన నీవు ||
