Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

60. మరచితివా ఓ దేవా, మమ్ముల మరచితివా? | Marachitiva oo deva Mammula Marachitiva | వేంకటేశ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
మరచితివా ఓ దేవా, మమ్ముల మరచితివా?
మరువము నీ ప్రియ నామమును,
విడువము నీ పదపద్మములు.
||మరచితివా ఓ దేవా||
పరమాత్మవని మేము పలు విధముల కొలిచేము,
పగలనకా రేయనకా నిను భక్తితో వేడేము.
కరుణామయుడవు నీవయ్యా, కన్నుల చూచగ రావయ్యా.
భక్తితో కొలిచే మానవులకు
ముక్తి నొసగువాడ నీవే కదా.
||మరచితివా ఓ దేవా||
నరహరి నారాయణా, దివ్య పుణ్యమోహనా,
అఖిలలోక పాలనా, సకలదేవ వందనా.
మరువక ఎప్పుడు కొలిచే భక్తుల మదిలో
చక్కగా నిలువుమయా.
మునిజన పాలనా, నీ ప్రియ లీలలు
అపురూపమయా భువిలోనా.
||మరచితివా ఓ దేవా||
పద్మావతి ప్రేమలోలా, అలమేలుమంగనాథా,
లక్ష్మీధర శ్రీరమణా, చూపించుము నీ కరుణా.
హృదయము నీకు అర్పించితిని,
పూజలు గైకొను ఓ దేవా.
ధరణిలో నిన్ను కొలచిన భక్తుల
నందరిని బ్రోవుము వేంకటరమణా.
||మరచితివా ఓ దేవా||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow