Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

96. కనిపించని లోకములో కైలాస శిఖరములో | Kanupinchani lokamlo kailasa| శివ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
కనిపించని లోకములో కైలాస శిఖరములో ||2||
వెలసెనులే శివశంకరుడే దరహాసపు నగవులతో
కనిపించని లోకములో కైలాస శిఖరములో ||2||

పొంగే గంగా భవాని ఇమిడిపోయే నీ శిరలోనే
వెలిగే నెలరాజు తానై కొలువు తీరే నీ శిరసునే
నీవే ఓంకార మూర్తిగా నీవే శంఖనాద ధ్వనిగా
ధ్యానింతురా మధుర స్మరణ ఓ, పలికెనులే ఆ భావనలే మా హృదయపు అంచులలో

కనిపించని లోకములో కైలాస శిఖరములో
వెలసెనులే శివశంకరుడే దరహాసపు నగవులతో
కనిపించని లోకములో కైలాస శిఖరములో

అర్ధనారీశ్వరుడై అవనినెల్ల మురిపించావు
అడిగిన వరాల నొసగి ఆత్మలింగమై మిగిలావు
నీవే జగమేలే స్వామిగా ముల్లోకముల దైవానిగా
పిలిచిన పలికే దైవముగా ఓ, పలికెనులే ఆ భావనలే మా హృదయపు అంచులలో

కనిపించని లోకములో కైలాస శిఖరములో ||2||
వెలసెనులే శివశంకరుడే దరహాసపు నగవులతో
కనిపించని లోకములో కైలాస శిఖరములో ||2||
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow